Amazon: అమెజాన్‌ను బురిడీ కొట్టించి లక్షల్లో లూటీ

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌ను బురిడీ కొట్టించి లక్షల్లో లూటీ చేసిన ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

Amazon: అమెజాన్‌ను బురిడీ కొట్టించి లక్షల్లో లూటీ

Arrested

Amazon: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌ను బురిడీ కొట్టించి లక్షల్లో లూటీ చేసిన ముగ్గురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు ఫతేబాద్ ప్రాంతానికి చెందిన వారు కాగా, ఒకరు హిసార్ ప్రాంతానికి చెందిన వారు. నిందితుల్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉంచారు.

అమెజాన్‌లో పలు అకౌంట్లు ఓపెన్ చేసి.. ఫేక్ ఐడెంటిఫికేషన్ తో డిఫరెంట్ ప్రొడక్టులు ఆర్డర్ ఇచ్చేవారు. ఆర్డర్ వచ్చిన తర్వాత రీఫండ్ చేయాలని.. ప్రొడక్ట్ డిఫెక్టివ్ గా ఉందంటూ రిక్వెస్ట్ పెట్టేవారు. అమెజాన్ పాలసీ ప్రకారం.. ప్రొడక్ట్ డిఫెక్టివ్ ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్నాక.. రీఫండ్ చేస్తుంది.

బాధితుల నుంచి డెలివరీ ఏజెంట్లు డ్యామేజ్‌డ్ ప్రొడక్ట్ లు తీసుకుని కొత్త ప్రొడక్ట్ ఇస్తున్నారు. ఒకసారి డెలివరీ ఏజెంట్లు రిసీవ్ చేసుకున్న ఆర్డర్లపై పిక్‌డ్ అప్ అని రాసేయడంతో రీఫండ్ వస్తుంది. అమెజాన్ కూడా డెలివరీ పార్టనర్ కు ప్రొడక్ట్ పంపి.. రీఫండ్ చేయమని అడుగుతుంది.

ఇలాగే చేసిన ముగ్గురు మంచి ప్రొడక్ట్ లను అమెజాన్ నుంచి రిసీవ్ చేసుకుని తక్కువ రేటుకే అమ్మడం మొదలుపెట్టారు. జులైలో ఇటువంటి గ్యాంగ్ లోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రాజ్ కుమార్ సింగ్, అరవింద్ కుమార్ , సీతారామ్ కుమార్ గా గుర్తించారు. ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ రెడ్డి.. చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.