UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ షెడ్యూల్

  • Published By: Subhan ,Published On : June 6, 2020 / 03:37 PM IST
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ షెడ్యూల్

సివిల్స్‌ సర్వీస్ 2020కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2020 అక్టోబర్‌ 4న సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష, అలాగే 2021 జనవరి 8న మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. పాత షెడ్యూల్‌ ప్రకారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షనే మే 31, 2020 న నిర్వహించాల్సి ఉంది. 

కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్‌కి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది UPSC. 2019 సంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన పర్సనాలిటీ టెస్టులు జులై 20, 2020 నుంచి ప్రారంభమవుతాయి. ఎంపికైన అభ్యర్దులకు వ్యక్తిగత సమాచారం అందించనున్నారు. 

ప్రతి సంవత్సరం దాదాపు యూపీఎస్సీ పరీక్షల్లో 7 లక్షల మంది అభ్యర్దులు ప్రిలిమినరీ పరీక్షలను రాసేందుకు పోటీపడుతుంటారు. ఈ సంవత్సరం దాదాపుగా 10 లక్షల మంది ప్రిలిమినరీ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు యూపీఎస్సీ తెలిపింది.

పరీక్షల తేదీలు:
> యూపీఎస్సీ సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ : అక్టోబర్ 4,2020.
> NDA & NA(1&2)పరీక్ష తేదీ : సెప్టెంబర్‌ 6,2020.
> IES/ISS పరీక్ష తేదీ : అక్టోబర్ 16,2020.
> కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ : అక్టోబర్ 22,2020.
> ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ప్రిలిమినరీ) :అక్టోబర్ 4, 2020.
> సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలిస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ :  డిసెంబర్ 20,2020.
> యూపీఎస్సీ సివిల్స్  సర్వీసెస్ మెయిన్ పరీక్ష తేదీ : జనవరి 8, 2021
> ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(మెయిన్) పరీక్షతేదీ :ఫిబ్రవరి 28, 2021
> ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష తేదీ : ఆగస్టు 9, 2020.