US Files : అమెరికాలో అలా..భారత్‌లో ఎందుకిలా? ప్రతిపక్ష నేతలపై జరిగే దర్యాప్తు సంస్థల దాడులు అధికారంలో ఉన్నవారిని ఎందుకు టచ్ చేయవు? కారణం అదేనా?..

భారతదేశంలో అవినీతి శాఖ అధికారుల దాడులు,దర్యాప్తు సంస్థల కళ్లు అన్నీ ప్రతిపక్ష నేతల మీదే ఉంటాయి. అధికార పార్టీకి ప్రత్యర్థులుగా కనిపించే వారి ఇళ్లలోనే సోదాలు చేస్తుంటాయి. కానీ అమెరికా కూడా మనలాంటి ప్రజాస్వామ్య దేశమే అయినా అక్కడ అలా ఉండదు. అక్కడ దేశాధ్యక్షుడైనా సామాన్య ఉద్యోగి అయినా ఒక్కటే. ఒక్క అమెరికాలోనే అలా ఉంటుందా? భారత్ లో అలా ఎందుకుండదు? చట్టం ముందు అంతా సమానమే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అని వినిపించే మాట నిజం ఎందుకు కాదు?భారత్‌లో అటువంటి స్లోగన్స్, సమానత్వం కేవలం పేపర్లకే పరిమితమా? అమలులో ఎందుకు జరగవు? అనే ప్రశ్నలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఆదేశ దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ సోదాలు చేసిన సందర్భంగా తెరపైకి వస్తున్నాయి.

US Files : అమెరికాలో అలా..భారత్‌లో ఎందుకిలా? ప్రతిపక్ష నేతలపై జరిగే దర్యాప్తు సంస్థల దాడులు అధికారంలో ఉన్నవారిని ఎందుకు టచ్ చేయవు? కారణం అదేనా?..

Documents Seized at US president Biden Home

Documents Seized at US president Biden Home : భారతదేశంలో అవినీతి శాఖ అధికారుల దాడులు,దర్యాప్తు సంస్థల కళ్లు అన్నీ ప్రతిపక్ష నేతల మీదే ఉంటాయి. అధికార పార్టీకి ప్రత్యర్థులుగా కనిపించే వారి ఇళ్లలోనే సోదాలు చేస్తుంటాయి. కానీ అమెరికా కూడా మనలాంటి ప్రజాస్వామ్య దేశమే అయినా అక్కడ అలా ఉండదు. అక్కడ దేశాధ్యక్షుడైనా సామాన్య ఉద్యోగి అయినా ఒక్కటే. ఒక్క అమెరికాలోనే అలా ఉంటుందా? భారత్ లో అలా ఎందుకుండదు? చట్టం ముందు అంతా సమానమే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అని వినిపించే మాట నిజం ఎందుకు కాదు?భారత్‌లో అటువంటి స్లోగన్స్, సమానత్వం కేవలం పేపర్లకే పరిమితమా? అమలులో ఎందుకు జరగవు? అనే ప్రశ్నలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో ఆదేశ దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ సోదాలు చేసిన సందర్భంగా తెరపైకి వస్తున్నాయి.

అమెరికా అంటే ప్రపంచంలో అగ్రరాజ్యం. అమెరికా ప్రెసిడెంట్ను పెద్దన్న అంటుంటారు. అటువంటి పెద్దన్న ఇంట్లోనే సోదాలు నిర్వహిస్తే మిగిలిన దేశాల్లో అలా ఎందుకు జరగవు? అనే ప్రశ్న వచ్చి తీరుతుంది. అమెరికా దాదాపు అన్ని దేశాల్ని శాసిస్తుంది. అటువంటి దేశాధినేత ఇంట్లోనే దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాను ప్రెసిడెంట్ బైడెన్ కూడా స్వాగతిస్తున్నానని అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు అంటే అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే పెద్దన్నే అలా చెబితే అది మిగిలిన దేశాధినేతలకు స్ఫూర్తివంటిదే. కానీ భారత్ తో పాటు మిగిలిన దేశాలు అలా ఆలోచిస్తాయా? అంటూ కాస్తే కాదు పెద్దగా ఆలోచించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలను కనుసైగతో శాసించే స్థాయి ఉన్న అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్ చేతిలో ఎంత పవర్ ఉంటుందో.. ఇట్టే ఊహించొచ్చు. ఆయన తలచకుంటే.. ఏదైనా మార్చేయగలడు. ఎలాంటి దర్యాప్తు సంస్థనైనా సరే.. కనుసైగతో శాసించగలడు. ఆపివేయగలడు. కానీ బైడెన్ అలా చేయలేదు.పైగా సోదాలను స్వాగతిస్తున్నానని వారికి సహకరిస్తానని తెలిపారు.

కానీ.. అధ్యక్షుడైనప్పటికీ.. బైడెన్ అలా చేయడం లేదు. చట్టం అందరికీ వర్తిస్తుందనే దాన్ని నమ్ముతున్నాడు. ఎఫ్‌బీఐ సోదాలు జరుపుతున్నా.. వాళ్లను అడ్డుకోవడం లేదు. కానీ.. ఇండియాలో ఈ పరిస్థితి ఉంటుందా? మన దేశంలో జరిగే దాడులన్నీ.. ప్రతిపక్ష నాయకుల మీదే జరుగుతుంటాయ్. ప్రతి రైడ్ వెనుక.. రాజకీయ కోణం దాగుంటుంది.దాగుంది అనేకంటే అది బహిరంగంగా కనిపించినా ఎవ్వరు ప్రశ్నించలేని పరిస్థితి. ప్రశ్నించినా ఆపలేని దుస్థితి. ఇది పొలిటికల్‌గా సెట్ అయితేనే.. దాడులు తగ్గుతాయ్. లేదంటే.. దర్యాప్తు సంస్థలు ఇంటి ముందు క్యూ కడతాయనే విమర్శలున్నాయ్. కేవలం.. ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా.. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలు, ఏసీబీ లాంటి రాష్ట్ర సంస్థలు.. సోదాలు జరుపుతాయనే టాక్ ఉంది.

Biden’s Secret Files : దేశాధ్యక్షుడు అయినా జో బైడెన్ ఇంట్లో FBI సోదాలు .. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా US ఫైల్స్ ఇష్యూ

అమెరికాలో.. ఆ దేశ అధ్యక్షుడైనా సరే.. ఆయన ఆఫీసుల్లో, ప్రైవేట్ నివాసాల్లో.. అధికారులు ధైర్యంగా సోదాలు చేయగలుగుతున్నారు. సీక్రెట్ ఫైల్స్ బయటపెట్టగలుగుతున్నారు. విచారణకు సిద్ధం కమ్మని.. హింట్ ఇస్తున్నారు. కానీ.. మన దగ్గర.. అధికార పార్టీ నాయకులను టచ్ చేసే దమ్ము, ధైర్యం పోలీసులకు గానీ, దర్యాప్తు సంస్థలకు గానీ ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. అదే అగ్రరాజ్యం అమెరికాలో.. బైడెన్ తీరుపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీక్రెట్ ఫైల్స్ విషయంలో.. బైడెన్ ఇక తప్పించుకోలేరని అంటున్నారు. అంతేకాదు.. బైడెన్ కుటుంబంతో పాటు కుమారుడు హంటర్ బైడెన్ అక్ర వ్యాపారాలపైనా సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. జో బైడెన్ నివాసాల్లో.. రహస్య పత్రాలు బయటపడటంపైనా.. కాంగ్రెస్ విచారణ జరుపుతుందని టాక్ వినిపిస్తోంది. అదే.. భారత్‌లో అయితే.. అధికార పార్టీ నేత ఇంటి గేటును టచ్ చేసేందుకు కూడా ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనే వాదన వినిపిస్తూ ఉంటుంది.

అమెరికాలో.. దర్యాప్తు సంస్థలపై ఎవరి ఒత్తిడి ఉండదు. వాళ్ల పని వాళ్లు స్వేచ్ఛగా, స్వతంత్రంగా చేసుకుంటూ వెళ్లిపోతారు. కానీ.. మన దగ్గర అలా కాదు. దర్యాప్తు సంస్థలు ఎవరిపై రైడ్ చేయాలి.. ఎవరి ఇళ్లలో సోదాలు చేయాలనేది.. వేరో చోట డిసైడ్ అవుతుంది. అందుకు తగ్గట్లుగా.. ఆదేశాలు వెళతాయ్. వాటి ప్రకారమే.. దాడులు జరుగుతాయనే విమర్శలున్నాయ్. ప్రతిపక్షాలు కూడా దర్యాప్తు సంస్థల విషయంలో ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటాయ్. ఇందుకు దేశంలో నెలకొన్న పరిస్థితులే కారణం. చట్టం ముందు అంతా సమానులే అన్నట్లుగా పరిస్థితులు, నిర్ణయాలు ఉంటేనే.. భారత్ ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.