Kid distribute water: మండుటెండలో వీధి వ్యాపారులకు మంచి నీరు అందిస్తున్న బుడతడు: నెటిజన్లు ఫిదా

ఎండ వేడిమిలో కూర్చుని పని చేస్తున్న వీధి వ్యాపారులకు ఈ చిన్నారి మంచి నీటి బాటిళ్లను పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

Kid distribute water: మండుటెండలో వీధి వ్యాపారులకు మంచి నీరు అందిస్తున్న బుడతడు: నెటిజన్లు ఫిదా

Water

Kid distribute water: పొట్టకూటి కోసం మండుటెండను సైతం లెక్కచేయకుండా వీధుల్లో వ్యాపారం చేసుకుంటున్న వారిని చూసి..ఆ బాలుడి మనసు కరిగిపోయింది. అంత ఎండలోనూ వీధులపై పూలు పండ్లు అమ్ముకుంటూ బ్రతుకీడుస్తున్న వారికి తన వంతుగా ఏదైనా సహాయం చేయదలుచుకున్నాడు. అనుకున్నదే తడవుగా చల్లటి మంచినీటి బాటిల్స్ కొని తెచ్చి వీధి వ్యాపారులకు పంచి ఇచ్చాడు ఆ బాలుడు. బాలుడి చూపిన మానవత్వం పట్ల నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎండ వేడిమిలో కూర్చుని పని చేస్తున్న వీధి వ్యాపారులకు ఈ చిన్నారి మంచి నీటి బాటిళ్లను పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయాన్ అనే బాలుడు ఒక ప్యాకెట్ బిస్లరీ వాటర్ బాటిల్స్ తీసుకుని ఫుట్‌పాత్‌పై కూర్చున్న పూల వ్యాపారులకు అందజేసాడు.

Also Read:Unemployment: దేశంలో పెరిగిన నిరుద్యోగిత రేటు: అత్యధికంగా హర్యానా, రాజస్థాన్

తమ కోసం చల్లటి వాటర్ బాటిల్స్ తెచ్చిన ఆ బాలుడిని ఒక వృద్ధురాలు మనసారా ఆశీర్వదించింది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. బాలుడి ఔదార్యాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వందేళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో ఎండలు మండుతున్నాయని భారత వాతావరణశాఖ చెప్పిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవాలి. ఇటువంటి సమయంలో ఎండా నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనీసం తాగేందుకు గుక్కెడు మంచి నీరు కూడా దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు.