ఉన్నదంతా అమ్మేశాడు…ఆన్‌లైన్ క్లాసులకు కూతురికి స్మార్ట్ ఫోన్ కొనలేక ఆ తండ్రి ఇబ్బందులు

ఉన్నదంతా అమ్మేశాడు…ఆన్‌లైన్ క్లాసులకు కూతురికి స్మార్ట్ ఫోన్ కొనలేక ఆ తండ్రి ఇబ్బందులు

డాక్టర్ అవ్వాలనుకునే కర్ణాటక కార్ వాషర్ యొక్క కుమార్తెకు ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ అవసరమైంది. కర్ణాటకు చెందిన కార్ వాషర్.. షంషుద్దీన్ అధోనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయన పెద్ద కుమార్తె జీనత్ బాను… PUC లేదా ప్రీ-యూనివర్శిటీ కాలేజీ పరీక్షలలో 94 శాతం మార్కులు సాధించింది. PCMBగా పిలువబడే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మరియు బయాలజీని సబెక్టుల కాంబినేషన్ ను జీనత్ బాను అభ్యసించింది.

అయితే ఈ వారం చివర్లో కర్ణాటకలోని ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి జీనట్… కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయనుంది. డాక్టర్ కావాలన్నది జీనత్ కల. కరోనా కారణంగా చాలా ఆలస్యం అయిన నీట్ పరీక్షకు కూడా జీనత్ హాజరుకానుంది. కానీ విద్యాపరంగా మొగ్గుచూపుతున్న ఈ విద్యార్థికి ఓ సవాలు ఉంది.

కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ రోజుల్లో శిక్షణ, కోచింగ్, విద్య అంతా ఆన్‌లైన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా తెచ్చిన కష్టంతో పేద విద్యార్థులున్న ఇళ్లలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయ్యి ఆకుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జీనత్ తండ్రి అధోని.. తన కుమార్తె విద్యలో సహాయపడటానికి స్మార్ట్ ఫోన్ పొందటానికి సహాయం కోసం ఆశిస్తున్నాడు.

అధోని.. ఉత్తర కర్ణాటకలోని గడగ్ లో కార్లను కడిగే పని చేస్తున్నాడు. నెలకు దాదాపు రూ. 6000 వరకు తాను సంపాదిస్తానని అధోని తెలిపాడు. జీనత్ మరియు ఆమె చెల్లెళ్ళు, హుమేరా మరియు షాగుఫ్తా విద్యకు నిధులు సమకూర్చేందుకు అతను తన బంధువుల నుండి డబ్బు తీసుకున్నాడు మరియు అతని భార్య బంగారు ఆభరణాలను అమ్మేసింది. ఆన్‌లైన్ తరగతులకు బాగా పనిచేసే స్మార్ట్‌ఫోన్ కుటుంబ బడ్జెట్‌కు మించినదని ఆయన అన్నారు.