Exotic animals: బ్యాగులో మూగ జీవాల స్మగ్లింగ్.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. పాపం ఎలా తీసుకొస్తున్నారో చూడండి!

అక్రమంగా రవాణా చేస్తున్న మూగజీవాల్ని చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ముంగిస, కాస్కస్ అనే మరో జీవిని బ్యాగులో కుక్కి తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. వీటిని బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చారు.

Exotic animals: బ్యాగులో మూగ జీవాల స్మగ్లింగ్.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. పాపం ఎలా తీసుకొస్తున్నారో చూడండి!

Exotic animals: అటవీ జంతువుల రవాణాపై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా జంతువును రవాణా చేయాలంటే ఇరు ప్రభుత్వాల అనుమతి కావాలి. పైగా, కొన్నింటిని మాత్రమే రవాణాకు అనుమతిస్తారు.

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’ సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకలు.. వెండి నాణేలు, స్వీట్లు బహూకరణ

దీంతో అనుమతి లేని జీవాలను మరో దేశానికి తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు అడ్డదారులు తొక్కుతుంటారు. అమానవీయంగా వ్యవహరిస్తారు. బ్యాగుల్లో మూగజీవాల్ని కుక్కి తీసుకెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి అధికారులకు పట్టుబడుతుంటాయి. తాజాగా చెన్నైలో ఇలాగే కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్టులో కొన్ని మూగజీవాల్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ముంగిసను, కాస్కస్ అనే మరో మూగజీవాన్ని చిన్న బ్యాగులో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వీటిని స్మగ్లర్లు థాయ్‌లాండ్ నుంచి తీసుకొస్తున్నారు. ముంగిస, కాస్కస్… రెండూ చాలా చిన్న సైజులో ఉంటాయి.

Property Transfer: ఆస్తి బదిలీ చేయాలంటే లంచం ఇచ్చుకోవాల్సిందే.. తాజా సర్వేలో వెల్లడి!

అందువల్ల వీటిని బ్యాగులో కామన్ లగేజీతోపాటు తీసుకెళ్లినా అధికారులు గుర్తించలేకపోవచ్చు అని స్మగ్లర్లు భావించారు. కానీ, మన కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా జరిపిన తనిఖీలో వీరి బండారం బయటపడింది. ప్రస్తుతం అధికారులు మూగజీవల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అధికారులు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.