Modi In Himachal: హిమాచల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించిన మోదీ.. ‘సింహం వచ్చింది’ అంటూ స్థానికుల నినాదాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఉనా రైల్వే స్టేషన్ నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు నడుస్తుంది. దేశంలో ప్రారంభించిన నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది. నరేంద్ర మోదీ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే అక్కడివారు ‘సింహం వచ్చింది’.. ‘మోదీ మోదీ’.. ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు.

Modi In Himachal: హిమాచల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించిన మోదీ.. ‘సింహం వచ్చింది’ అంటూ స్థానికుల నినాదాలు

Updated On : October 13, 2022 / 3:40 PM IST

PM Narendar Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఉనా రైల్వే స్టేషన్ నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు నడుస్తుంది. దేశంలో ప్రారంభించిన నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది. నరేంద్ర మోదీ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే అక్కడివారు ‘సింహం వచ్చింది’.. ‘మోదీ మోదీ’.. ‘జై శ్రీరాం’ నినాదాలతో హోరెత్తించారు.

హిమాచల్ పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ రోడ్లు వేయడానికి ప్రణాళికలు వేసుకుంది. గత ఎనిమిది ఏళ్లలో హరియాణాలోని గ్రామాల్లో 12,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వంట గ్యాస్ అందేలా చేసింది. రోడ్లు, విద్యుత్తు సౌకర్యం, ఉపాధి ప్రతి ఒక్కరికీ అందుతోంది. కొవిడ్ వ్యాక్సినేషన్ లో హిమాచల్ ప్రదేశ్ కు ప్రాధాన్యం ఇచ్చాం’’ అని చెప్పారు.