Viral video : పెళ్లికొచ్చిన అతిథుల‌తో క‌ప్ప గంతులు వేయించిన పోలీసులు

చి ఓ వివాహ వేడుక‌కు హాజ‌రైన కొంతమంది అతిథుల‌కు పోలీసులు వింత శిక్ష విధించారు. వారితో రోడ్డుమీద కప్పగంతులు వేయించారు. కప్పలు ఎలాగైతే గెంతుతాయో వారితో అలా గెంతులు వేయించారు.

Viral video : పెళ్లికొచ్చిన అతిథుల‌తో క‌ప్ప గంతులు వేయించిన పోలీసులు

Wedding Guests Frog Jumps

wedding guests frog jumps : కరోనా కాలంలో జరిగే పెళ్లిళ్లు ఎంత చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయో ప్రతీరోజు వార్తల్లో చూస్తునే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఎప్పుడూ వినని విధంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ కాలంలో జరిగే పెళ్లిళ్లకు 20మంది కంటే ఎక్కువమంది హాజరు కాకుండనే రూల్స్ ఉన్నాయి. అలాగే లాక్ డౌన్ నిబంధలను కూడా కొనసాగుతున్న క్రమంలో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఓ వివాహ వేడుక‌కు హాజ‌రైన కొంతమంది అతిథుల‌కు పోలీసులు వింత శిక్ష విధించారు. వారితో రోడ్డుమీద కప్పగంతులు వేయించారు. కప్పలు ఎలాగైతే గెంతుతాయో వారితో అలా గెంతులు వేయించారు పోలీసులు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ భింద్ జిల్లాలోని ఉమ‌రై గ్రామంలో ఓ పెళ్లి జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌కు నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా 300 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంటనే వచ్చేశారు. పోలీసుల‌ు రావటం చూసిన కొంతమంది పారిపోయారు. కానీ కొంతమంది దొరికిపోయారు. అలా దొరికిన 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితో న‌డిరోడ్డుపై క‌ప్ప గంతులు వేయించారు.

కొద్ది దూరం కప్పగంతులు వేసుకుంటూ వెళ్లిన కొంతమంది పైకి లేచేసరికి పక్కనే ఉన్న పోలీసులు లాఠీలతో ముందుకొచ్చారు. వారిని కొడుతున్నట్లుగా బెదిరించారు.దీంతో వాళ్లుమళ్లీ కింద కూర్చుని కప్పగంతులు వేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వారిని పోలీసులు హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.