JNU ఘటన ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ : మమతా బెనర్జీ

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 08:51 AM IST
JNU ఘటన ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ : మమతా బెనర్జీ

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) క్యాంపస్‌లో ఆదివారం జరిగిన హింస  ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కింద లేరనీ పోలీస్ శాఖ కేంద్ర ప్రభుత్వంలో ఉందని అన్నారు. జేఎన్ యూ క్యాంపస్ లోకి బీజేపీ ఓ వైపు ఒక వైపు గూండాలను పంపి యూనివర్శిటిలో ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ లకు పాల్పడుతోందని విమర్శించారు. 

ఈ ఘటన ప్రజాస్వామ్యంపై  ప్రమాదకరమైన దాడి అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరైనా సరే వారిపై దేశ ద్రోహులు అని ముద్ర వేస్తున్నారనీ..బీజేపీని విమర్శించినవారంతా పాకిస్తానీ దేశస్థులంటూ ఎదురు దాడికి దిగుతున్నారనీ విమర్శించారు. బీజేపీ తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎవ్వరు తప్పు పట్టినా వారు దేశానికి  శత్రువులుగా ముద్రవేయబడుతున్నారనీ ఇది బీజేపీ నియంతృత్వం పాలనకు నిదర్శనమని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇటువంటి పాలనను..పరిస్థితి దేశంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అన్నారు. 

జేఎన్ యూలో ఆదివారం (జనవరి 4,2020)న క్యాంపస్ లోకి ముసుగులు ధరించిన 50మంది గుర్తు తెలియని వ్యక్తులు విద్యార్థులు, ఫ్యాకల్టీలపై దాడికి పాల్పడ్డారు. అఖిల్ భారతీయ విద్యా పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడ్డారని కొంతమంది విద్యార్థులు ఆరోపిస్తున్నారు.