Indian Defence : చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే..భారత్ దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? చైనా ఆయుధ సత్తా ఎంత?

రక్షణ రంగంలో బలోపేతమవుతున్న భారత్‌కు చైనా నుంచి ఎప్పుడూ ముప్పుపొంచే ఉంటుంది. అందుకే భారత్.. రక్షణ రంగానికే అత్యధిక నిధులు ఖర్చు చేస్తోంది. ఒకవేళ చైనాతో తలపడాల్సి వస్తే.. మన దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? చైనా దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత ఉందో తెలుసుకుందాం..

Indian Defence : చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే..భారత్ దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? చైనా ఆయుధ సత్తా ఎంత?

Bharath China Defense Sector

Indian Defence : రక్షణ రంగంలో బలోపేతమవుతున్న భారత్‌కు చైనా నుంచి ఎప్పుడూ ముప్పుపొంచే ఉంటుంది. అందుకే భారత్.. రక్షణ రంగానికే అత్యధిక నిధులు ఖర్చు చేస్తోంది. ఒకవేళ చైనాతో తలపడాల్సి వస్తే.. మన దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? చైనా దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత?

ప్రపంచ దేశాల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నాలుగో అతిపెద్ద వైమానిక దళం. అమెరికా, రష్యా, చైనా మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. అంటే మన సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ.. ఈ త్రివిధ దళాల దగ్గర లేని ఆయుధమంటూ ఏదీ లేదు. క్షిపణులు మొదలుకొని యుద్ధట్యాంకులు, అడ్వాన్స్‌డ్ మెషీన్ గన్స్‌, ఆకాశంలో దూసుకుపోయే ఫైటర్‌ జెట్స్‌, శత్రువుల జాడను పసిగట్టే డ్రోన్స్‌, ఎటాకింగ్‌ హెలికాఫ్టర్లు, డిస్ట్రాయర్‌లు, వార్‌ షిప్‌లు, సబ్‌మెరైన్‌లు ఇలా అత్యాధునిక ఆయుధాలన్నీ మన దగ్గర ఉన్నాయి. చైనా కూడా మనల్ని నేరుగా ఎదుర్కోలేక వెనకడుగు వేస్తోందంటే దానికి మన వెపన్ పవరే కారణం. ఎప్పటికప్పుడు పాత ఆయుధాల స్థానంలో కొత్త ఆయుధాలను రీప్లేస్‌ చేస్తూ.. త్రీ ఫోర్సెస్‌ను ఫవర్‌ఫుల్‌గా మారుస్తున్నారు. ఇంతకాలం అతిపెద్ద ఆయుధ దిగుమతి దారుగా ముద్ర వేసుకున్న మనం.. ఇప్పుడు ఆయుధ ఎగుమతి దారుగానూ మారుతున్నాం. క్షిపణులు, రైఫిల్స్‌, డ్రోన్లు సొంతంగానే తయారు చేసుకునే సామర్థ్యం సాధించాం.. ఇతర దేశాలకు కూడా ఎగమతి చేయగలుగుతున్నాం.

Also read : Indian Defence : ఆయుధాలు@మేడిన్ ఇండియా..రక్షణ రంగం బలోపేతం దిశగా భారత్ అడుగులు..

భారత్‌కు ప్రధాన శత్రువులు ఇద్దరు. ఒకరు చైనా, మరొకరు పాకిస్థాన్. ఇద్దరూ మన దేశానికి చెరోవైపు ఉన్నారు. సందుదొరికితే చాలు.. భారత్‌పైకి ఏదో ఒక రూపంలో దాడికి పాల్పడుతూనే ఉంటారు. నిత్యం రెండు దేశాలతో ఏదో ఒకచోట భారత త్రివిధ దళాలు పోరాటం చేస్తూనే ఉంటాయి. ఆయుధ సంపత్తిలో కానీ, ఆర్మీ విషయంలోకానీ.. ప్రతీ దాంట్లో పాకిస్థాన్ మనకంటే తక్కువే. ఏదైనా తేడా వస్తే పాకిస్థాన్‌ను మనసైన్యం ఒకటి పీకి కూర్చోబెట్టగలదు. ఎటొచ్చి బలమైన చైనాతోనే మనకు కొంత ఇబ్బంది. చైనాతో పోటీ పడడం కొంత కష్టమే అయినా భారతసైన్యం ఎప్పడూ వెనకడుగు వేయలేదు. అసలు రక్షణ రంగానికి భారత్‌, చైనా ఎంత ఖర్చు చేస్తున్నాయి. ఎవరి బెడ్జెట్ ఎంత?

2021లో ఆర్మీ కోసం అత్యధికంగా ఖర్చు దేశాల్లో భారత్ మూడో స్థానంలోనిలిచిందని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిస్ట్యూట్ ప్రకటించింది. అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికా 2021లో 80వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే.. చైనా 22వేల 950కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. భారత్ 7 వేల 600 కోట్ల డాలర్లు రక్షణ రంగానికి వెచ్చింది. చైనా ప్రభుత్వం గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022 ప్రకారం భారత్ వద్ద 4వేల 614 యుద్ధ ట్యాంకర్లు ఉండగా.. చైనా వద్ద 5వేల 250 ఉన్నాయి. సెల్ఫ్‌ ప్రొపెల్డ్ ఆర్టిలరీ భారత్‌ వద్ద 100 ఉండగా.. చైనా వద్ద 4120 ఉన్నాయి. చైనా వద్ద రాకెట్ ప్రొజెక్టర్స్ 3160 ఉండగా.. భారత్ వద్ద 1338 ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్యారీయర్స్ ఇండియా వద్ద 1, చైనా వద్ద 2 ఉన్నాయి. సబ్‌మెరైన్స్ ఇండియా 17, చైనా 79, డెస్ట్రాయర్స్ ఇండియా 10, చైనా 41, ఫ్రైగేట్స్ ఇండియా 13, చైనా 49, కార్వెట్టీస్ ఇండియా 22, చైనా 70, మైన్ వార్‌ఫేర్ ఇండియా 0, చైనా 36 ఉన్నాయి. ఇక ట్యాంకర్స్ విషయానికొస్తే ఇండియా వద్ద 4వేల 614 ఉండగా చైనా వద్ద 5వేల 250 ఉన్నాయి. ఆర్మర్డ్ వెహికిల్స్ ఇండియా దగ్గర 12000, చైనా దగ్గర 35వేలు, సెల్ఫ్‌ ప్రొపెల్డ్ ఆర్టిలరీ ఇండియా దగ్గర 100, చైనా దగ్గర 4120, ఆర్డిలరీ భారత్ దగ్గర 3311, చైనా దగ్గర 1734, మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్స్ భారత్ దగ్గర 1338, చైనా దగ్గర 3,160 ఉన్నాయి. ఇక భారత్‌కు పారా మిలటరీ ఫోర్సెస్ 25లక్షల 27వేలు ఉండగా.. చైనా వద్ద కేవలం 6లక్షల 24వేలు మాత్రమే ఉంది.

Also read : GULF Contries serious on India :బీజేపీ నేతల వ్యాఖ్యలతో ప్రమాదంలో భారత ఆర్ధిక వ్యవస్థ..ఆంక్షల దిశగా 15 ముస్లిం దేశాలు

రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కువ శాతం నిధులకే పోతోంది. దీంతో కొత్త కొత్త ఆయుధాలను సమకూర్చుకోవడమే కాదు.. రక్షణ రంగంలో వృద్ధా ఖర్చులపైనా భారత రక్షణ శాఖ దృష్టి సారించింది. ఆయుధ సంపత్తిలో ఇతర దేశాలకు ఎందులోనూ తగ్గకుండా భారత్ ముందుకు దూసుకుపోతోంది. ఆయుధాల కోసం పొరుగుదేశాలపై ఆధారంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు చేపట్టింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటూ భారత ఆర్మీని అగ్రభాగంలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.