Bihar: వీధి కుక్కలపై వేట ప్రారంభించిన బిహార్ ప్రభుత్వం.. కారణం ఏంటంటే?

ఈ యేడాదిలో సుమారు తొమ్మిది మహిళలు వీధి కుక్కల దాడిలో మరణించినట్లు బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చాలా గ్రామాలు వీధి కుక్కల భయంతో బిక్కు బిక్కు మంటున్నాయి. గత నెలలోనే నలుగురు మరణించారు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. కొన్ని కుక్కలు మనుషుల్ని తినేందుకు రుచి మరిగినట్లు కూడా ప్రభుత్వం తెలిపింది.

Bihar: వీధి కుక్కలపై వేట ప్రారంభించిన బిహార్ ప్రభుత్వం.. కారణం ఏంటంటే?

Why Bihar government shooters are chasing and gunning down dogs

Bihar: బిహార్ ప్రభుత్వం కుక్కలపై వేట ప్రారంభించింది. గురువారం మద్యాహ్నం నాటికే ఒక్క బెగుసరై జిల్లాలోనే 24 కుక్కల్ని ప్రభుత్వం నియమించిన ఒక బృందం కాల్చి చంపేసింది. మంగళవారం 15 కుక్కల్ని హతమార్చారు. బుధవారం 9 కుక్కల్ని మట్టుబెట్టారు. ఒక్క జిల్లాలోనే ఈ సంఖ్యలో జరుగుతుంటే, ఇక రాష్ట్రంలో జరిగే సంఖ్య గురించి మీరే ఊహించుకోవచ్చు. వాస్తవానికి రాష్ట్రంలో అక్రమ మద్యం అంశం చాలా రోజులుగా వివాదాస్పంగా ఉంది. ఇక రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి, విద్యా పరిస్థితులు, జీవిన విధానంపై అనేక విమర్శలు ఉన్నాయి. వీటన్నిటినీ కాదని, వీధి కుక్కల్ని హతమార్చే కార్యక్రమం ఎందుకు ప్రారంభించారనే ప్రశ్న వెనుక పెద్ద కారణమే ఉందని ప్రభుత్వం పేర్కొంది.

Modern Clothes Advice to Yogi: కాషాయం విప్పి కాస్త మోడ్రన్ బట్టలు వేసుకోండి.. యోగీకి కాంగ్రెస్ నేత సూచన

రాష్ట్రంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు ఎక్కువయ్యాయట. అనేక మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారట. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు నమోదు అవుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా బెగుసరై, బచ్చవారా జిల్లాల్లో ఈ దాడులు విపరీతంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వీధి కుక్కల్ని నిర్మూలించి ప్రజల్ని కాపాడడం కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వారికి ఆయుధాలిచ్చి, వీధి కుక్కలపై షూటింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది.

Delhi: రోడ్డుపై సంగీత కళాకారుడిని నిలువరించిన ఢిల్లీ పోలీస్.. విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

ఈ యేడాదిలో సుమారు తొమ్మిది మహిళలు వీధి కుక్కల దాడిలో మరణించినట్లు బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చాలా గ్రామాలు వీధి కుక్కల భయంతో బిక్కు బిక్కు మంటున్నాయి. గత నెలలోనే నలుగురు మరణించారు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. కొన్ని కుక్కలు మనుషుల్ని తినేందుకు రుచి మరిగినట్లు కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే ఆ కుక్కలు ఇలా కావడానికి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మాంసం వ్యర్థల్ని ఇష్టారీతిన పడేయడం వల్ల, ఆ మాంసానికి అలవాటు పడ్డ కుక్కలు.. మనుషులపై దాడికి పాల్పడుతున్నట్లు తెలిపారు.