1971 యుద్ధంలో చనిపోయాడని చెప్తున్న ఇండియన్ ఆర్మీ సైనికుడు మంగళ్ సింగ్ ఇప్పటికీ పాక్ జైల్లోనే..

1971 యుద్ధంలో చనిపోయాడని చెప్తున్న ఇండియన్ ఆర్మీ సైనికుడు మంగళ్ సింగ్ ఇప్పటికీ పాక్ జైల్లోనే..

Indian Army Soldier – Mangal Singh: లాన్స్ నాయక్ మంగళ సింగ్ అనే 26ఏళ్ల ఇండియన్ ఆర్మీ సైనికుడిని యుద్ధ ఖైదీగా తీసుకున్నారు. ఇప్పటికీ అతను జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. దాదాపు 50సంవత్సరాల తర్వాత అతని కుటుంబానికి ఈ విషయం తెలిసింది. వెనక్కు తీసుకురావలని ఎన్ని విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తుంది.

పాకిస్తాన్‌పై ఇండియా యుద్ధం గెలిచింది కానీ, ఆర్మీ బలగాలను త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇరు వర్గాల నుంచి వేల మంది యుద్ధ ఖైదీలుగా మారిపోయారు. ఇండియా, పాకిస్తాన్ గవర్నమెంట్లు సైనికుల గురించి 1972 సిమ్లా అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఈ మేరకు ఇండియా 93వేల మంది పాకిస్తాన్ సైనికులను తిరిగి పంపించేసింది. పాకిస్తాన్ 600మంది ఇండియన్ సైనికులను ఇండియాకు పంపించింది.

వీరిలో పాకిస్తాన్ సైనికుడు లాన్స్ నాయక్ మంగళ్ సింగ్ మాత్రం అక్కడే ఉన్నాడు. దాదాపు 50ఏళ్ల తర్వాత అతని భార్య, ఇద్దరు కొడుకులు ఇంకా అతని కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. సత్య దేవీ అనే 75ఏళ్ల మహిళ ఇండియాలోని జలంధర్ సిటీ నుంచి అతని కోసం పడిగాపులు కాస్తుంది. సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత ఆమెకు ఈ నెలారంభంలో గుడ్ న్యూస్ వచ్చింది.

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమెకు సింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 2020 డిసెంబర్ 2వ తేదీన వచ్చిన లెటర్ లో తప్పిపోయిన 83మంది డిఫెన్స్ పర్సనల్ జాబితా పాకిస్తాన్ కస్టడీలో ఉన్నట్లు వెల్లడించింది.

సింగ్ 1962లో ఇండియన్ ఆర్మీలో చేరారు. ఆ సమయంలో రాంచీలో పోస్టింగ్ తీసుకున్న సింగ్ 1971లో వెస్ట్ బెంగాల్‌లోని కోల్‌కతాకు ట్రాన్సఫర్ అయ్యాడు. కొద్ది రోజుల తర్వాత సత్యదేవీకి ఓ లెటర్ వచ్చింది. ఇండియన్ సైనికులను తీసుకెళ్తున్న పడవ ప్రమాదానికి గురై ఎవ్వరూ ప్రాణాలతో మిగలలేదని అందులో ఉంది. ఆ సమయంలో అతని పిల్లలకు ఒకరికి మూడు, రెండో వాడికి ఒకటిన్నరేళ్ల వయస్సు.

సంవత్సరం తర్వాత సింగ్ రావల్పిండి రేడియోలో సింగ్ బతికే ఉన్నట్లు చెప్పింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి పేర్లు దల్జీత్ సింగ్, బల్జీందర్ సింగ్ అని చెప్పింది రేడియో.

గతేడాది ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ 83మంది ఇండియా డిఫెన్స్ పర్సనల్ లు యుద్ధం నుంచి మిస్ అయిపోయారంటూ వారు పాకిస్తాన్ కస్టడీలో ఉన్నట్లు తెలిపింది.