LJP MP Prince Raj : చిరాగ్ పాశ్వాన్ సోదరుడిపై అత్యాచార ఆరోపణలు

లోక్​ జనశక్తి పార్టీ(LJP) నేత చిరాగ్​ పాశ్వాన్ సోదరుడు, LJP రెబల్ ఎంపీ ప్రిన్స్​ రాజ్​ పాశ్వాన్ పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది.

LJP MP Prince Raj : చిరాగ్ పాశ్వాన్ సోదరుడిపై అత్యాచార ఆరోపణలు

Woman Files Rape Complaint Against Chirag Paswans Cousin And Rebel Ljp Mp Prince Raj In Delhi

LJP MP Prince Raj లోక్​ జనశక్తి పార్టీ(LJP) నేత చిరాగ్​ పాశ్వాన్ సోదరుడు, LJP రెబల్ ఎంపీ ప్రిన్స్​ రాజ్​ పాశ్వాన్ పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఢిల్లీలోని కన్నోట్​ ప్లేస్​ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ప్రిన్స్​ రాజ్​ ఓ మహిళా కార్యకర్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చిరాగ్​ పాశ్వాన్ ఆరోపించిన కొన్ని గంటలకే మహిళ ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం.

తనకు మత్తుమందు ఇచ్చి ప్రిన్స్​ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ తన మూడు పేజీల ఫిర్యాదులో ఆరోపించింది. అయితే ఎంపీ స్థాయి వ్యక్తిపై ఆరోపణలు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై త్వరలో ప్రిన్స్​ రాజ్​ను పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.