Railway Track: రైలు పట్టాలపై దూకిన మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్

ఎదురుగ రైలు వస్తున్నది గమనించి రైలు పట్టాలపై దూకిందో మహిళ.. వెంటనే తేరుకున్న పోలీస్ ఆమెను రక్షించారు. కాగా ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.

Railway Track: రైలు పట్టాలపై దూకిన మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్

Railway Track

Railway Track: ఎదురుగ రైలు వస్తున్నది గమనించి రైలు పట్టాలపై దూకిందో మహిళ.. వెంటనే తేరుకున్న పోలీస్ ఆమెను రక్షించారు. కాగా ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఓ మహిళ ఖైదీని విచారణ నిమిత్తం ఓ ప్రాంతంలో నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఈమె వెంట ఓ లేడి కానిస్టేబుల్, మరో మేల్ కానిస్టేబుల్ ఉన్నారు.

ఎదురుగా వస్తున్న రైలును గమనించిన ఖైదీ.. మహిళ కానిస్టేబుల్ చేతిలోంచి విదిలించుకుని పట్టాలపైకి దూకింది. వెంటనే గమనించిన మెల్ కానిస్టేబుల్ ఆమెను రక్షించారు. ఆమెను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు కానిస్టేబుల్.. కాగా ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఉన్న‌ట్టుండి మ‌హిళ ఒకేసారి రైలు ముందు దూకడంతో రైల్వేస్టేష‌న్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. కొద్దీ సేపు ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది.