Zomato IPO: బిలియన్ డాలర్లకు పైగా విలువతో ఐపీఓకు జొమాటో

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వెళ్లింది. సుమారు రూ.8వేల 260 కోట్ల (111 కోట్ల డాలర్లు) విలువతో ఐపీవో ఫైల్ చేసింది.

Zomato IPO: బిలియన్ డాలర్లకు పైగా విలువతో ఐపీఓకు జొమాటో

Zomato Ipo

Zomato IPO: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వెళ్లింది. సుమారు రూ.8వేల 260 కోట్ల (111 కోట్ల డాలర్లు) విలువతో ఐపీవో ఫైల్ చేసింది. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ తమ బిజినెస్‌కు మంచి ఊపు రావడం, అంతా అనుకూలిస్తుండటంతో జొమాటో ఐపీవోకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది.

బుధవారం భారత మార్కెట్ నియంత్రణ సంస్థకు ఐపీవో ముసాయిదా ఫైల్ ను సమర్పించింది. 2008లో మొదలైన ఈ స్టార్టప్‌కు చైనా దిగ్గజ సంస్థ యాంట్ గ్రూప్ పెట్టుబడులు పెడుతూ వస్తోంది. 24 దేశాల్లో సేవలందిస్తోన్న జొమాటోలో 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో ఐదుగురు ఇన్వెస్టర్ల నుంచి 25 కోట్ల డాలర్ల నిధులను జొమాటో సమీకరించింది.

ప్రస్తుతం రూ.7వేల 500 కోట్ల విలువైన కొత్త షేర్లను ప్రజలకు ఆఫర్ చేస్తున్నట్టు జొమాటో వెల్లడించింది. నిధుల సమీకరణ, సాధారణ కార్పొరేట్ వ్యవహారాల కోసం ఐపీవోకు వెళ్తున్నట్టు సంస్థ ప్రకటించింది.

కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, క్రెడిట్ సూస్ సెక్యూరిటీస్ ఇండియా, బోఫా సెక్యూరిటీ ఇండియా అండ్ సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా సంస్థలు జొమాటో ఐపీఓకు లీడ్ బుక్ రన్నింగ్ మేనేజర్స్ గా వ్యవహరిస్తున్నారు.