Rajasthan farmer cow calf : ఆవు కోసం ఆరెకరాలు అమ్మి రైతన్న అలుపెరగని పోరాటం .. దూడ కోసం డీఎన్ఏ టెస్ట్ చేయించి తల్లీ బిడ్డల్ని కలిపిన కథ

తన ఆవు కోసం తన బిడ్డను దానికి దగ్గర చేయటం కోసం ఓ రైతు అలుపెరుగని పోరాటం చేశాడు. రాజస్థాన్ కు చెందిన 70 ఏళ్ల రైతు తన ఆరు ఎకరాల పొలం అమ్ముకుని మరీ పోలీస్ స్టేషన్ చుట్టు కాళ్లరిగేలా రెండేళ్లు తిరిగాడు. ఆఖరికి డీఎన్ఏ టెస్ట్ ద్వారా తన దూడను నిర్దారించుకుని దక్కించుకున్నాడు. ఇక ఆ రైతు ఆనందం అంతా ఇంతాకాదు.

Rajasthan farmer cow calf : ఆవు కోసం ఆరెకరాలు అమ్మి రైతన్న అలుపెరగని పోరాటం .. దూడ కోసం డీఎన్ఏ టెస్ట్ చేయించి తల్లీ బిడ్డల్ని కలిపిన కథ

rajasthan farmer DNA Test For Cow Calf

Rajasthan farmer fight cow calf : తన ఆవు కోసం తన బిడ్డను దానికి దగ్గర చేయటం కోసం ఓ రైతు అలుపెరుగని పోరాటం చేశాడు. ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిపోయిన దూడను తల్లీని కలపటం కోసం రాజస్థాన్ కు చెందిన 70 ఏళ్ల రైతు తన ఆరు ఎకరాల పొలం అమ్ముకుని మరీ పోలీస్ స్టేషన్ చుట్టు కాళ్లరిగేలా రెండేళ్లు తిరిగాడు. తన దూడ దొరికే వరకు పోరాటాన్ని ఆపేదిలేదని పోరాడి పోరాడి ఎట్టకేలకు తన దూడను దక్కిచుకున్నాడు. తల్లీ బిడ్డలను కలిపాడు. కన్నబిడ్డను ఆ ఆవు మర్చిపోయిందేమో గానీ ఆ రైతు మాత్రం మర్చిపోలేదు. దూడను ఎవరు దొంగిలించాడో తెలుసుకున్నాడు. గ్రామస్తుల ముందు పంచాయితీ పెట్టాడు.  కానీ దొంగిలించిన వ్యక్తి బుకాయించాడు.నువ్వే అమ్మేసుకుని నామీద నిందలేస్తున్నావంటూ ఆరోపణలు చేశాడు. గ్రామస్తులతో తన దూడను తనకు ఇప్పించాలని కోరాడు. కానీ దూడను ఎత్తుకెళ్లిన వ్యక్తం అబద్దాలాడాడు.

తనను దొంగగా చిత్రీకరించిన ఎత్తుకెళ్లిన తన దూడ కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తనకు తన ఆవుకు న్యాయం చేయమని మొరపెట్టుకున్నాడు. కానీ పోలీసులు లైట్ తీసుకున్నారు. కనిపించకుండాపోయిన మనుషులకే దిక్కులేదు. నీ ఆవుదూడ కోసం మేం వెతకాలా?అంటూ చులకన చేసిన మాట్లాడారు. కానీ ఆ రైతు మాత్రం పట్టువదల్లేదు. పోలీసులను పదే పదే అడిగేవాడు. దీంతో పోలీసులు పట్టించుకోకపోవటంతో ఏకంగా సెల్ టవర్ ఎక్కాడు. తనకు న్యాయం చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో పోలీసులకు ఇదేం గోలరాబాబూ అనుకుని ఆ రైతుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినా పోరాటం ఆపలేదు.

రాజస్ధాన్ లోని చురూలోని రామ్‌నగర్‌ బాస్‌ ప్రాంతానికి చెందిన దులారామ్‌కు కొన్ని పశువులున్నాయి. వాటిలో ఆవులు కూడా ఉన్నాయి. వాటిలో ఓ ఆవుదూడను 2021 ఫిబ్రవరి 11న ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో దూడ కోసం దులారామ్ ఎన్నో చోట్ల వెతికాడు.కానీ ఫలితం దక్కకపోవటంతో డిసెంబరు 21నలో సర్దార్‌శహర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు దూడ దొంగిలించబడి 10నెలలు అవుతోంది ఇప్పుడు కేసేంటి?అంటూ ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా అతను వదలకపోవటంతో పోలీసులు ఆగ్రహంతో కొట్టినంత పనిచేశారు. దీంతో దులారామ్ ఎస్పీ వద్దకెళ్లి పరిస్థితి చెప్పాడు. ఓ ఆవుదూడ కోసం ఆ రైతు పడుతున్న ఆవేదనకు ఎస్సీ చలించిపోయారు.

ఎస్పీ ఆదేశాలతో కొన్ని రోజులకు కేసు నమోదైంది. కానీ స్థానిక పోలీసుల నిర్లక్ష్యంతో విచారణ పూర్తికాకముందే కేసు మూసేసారు. అది తెలుసుకున్న అతను ఎన్నో సార్లు పోలీసుల వద్దకెళ్లి చెబుతుండేవాడు. దానికి పోలీసులు విసుక్కునేవారు. కానీ దులారామ్ దూడ కోసం యత్నాలు మానలేదు. ఈ క్రమంలోనే 2022 నవంబరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోట్ తమ ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకున్నాడు. దూడ కోసం దులారామ్ చేసిన పోరాటంలో ఎంతో డబ్బు ఖర్చుపెట్టాడు. తనకున్న పొలంలో ఆరు ఎకరాలు అమ్మేసి మరీ దూడ కోసం పోరాడాడు.

ఉన్నతాధికారుల దృష్టి పడేందుకు అక్కడే ఓ టవర్‌ ఎక్కాడు. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి, న్యాయం చేస్తామని వారంతా హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు కిందికి దిగాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో దులారామ్‌ ఇంట్లోని ఆవుతోపాటు ఎత్తుకెళ్లిన దూడ డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు. హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో వాటిని పరీక్షించేందుకు పంపారు.

ఇటీవలే డీఎన్‌ఏ రిపోర్టు వచ్చాయి. రిపోర్టుల్లో రెండు నమూనాలు మ్యాచ్‌ అయ్యాయి. దీంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పోలీసులు ఆ దూడను రైతుకు అప్పగించారు. తిరిగి దక్కిన ఆ దూడను చూసిన దులారామ్ ఆనందం అంతా ఇంతా కాదు. భావోద్వేగానికి గురయ్యారు. దూడను ముద్దుల ముంచెత్తాడు. తన కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్దార్‌శహర్‌ పోలీస్‌ స్టేషన్‌ బయట నిరసన చేపడతానని తెలిపాడు.