Anand mahindra : ”హ్యాండ్ మేడ్ అండ్ ఫ్యాన్ మేడ్” ఐస్ క్రీమ్ .. మనసుంటే మార్గముంటుందంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

''హ్యాండ్ మేడ్ అండ్ ఫ్యాన్ మేడ్'' ఐస్ క్రీమ్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఓ మహిళ వినూత్నంగా తయారు చేసిన ఐస్ క్రీమ్ వీడియోపై మనసుంటే మార్గముంటుందంటూ ప్రశంసలు కురిపించారు.

Anand mahindra : ”హ్యాండ్ మేడ్ అండ్ ఫ్యాన్ మేడ్” ఐస్ క్రీమ్ .. మనసుంటే మార్గముంటుందంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand mahindra : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహిస్తుంటారు. ఇంట్రెస్టింగ్ వీడియోను పోస్ట్ చేస్తు తన ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. అలాంటి మరో వీడియోను పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఓ మహిళ ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసే వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మనసుంటే మార్గముంటుంది అంటూ హ్యాండ్ మేడ్, ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీమ్ ‘భారతదేశంలో మాత్రమే’ అంటూ కొటేషన్ ఇచ్చారు.

ఈ వీడియోలో ఓ మహిళ ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేయటానికి చేస్తుంది. బహుశా వారి ఇంట్లో ఫ్రిడ్జ్ లేదో లేదా ఫ్రిడ్జ్ లేకపోయినా ఐస్ క్రీమ్ లో ఎలా వినూత్నంగా తయారు చేసుకోవచ్చు తెలియజేయటానికో గానీ..వినూత్నంగా ఐస్ క్రీమ్ తయారు చేసి ఆనంద్ మహీంద్రాని ఫిదా చేసిందీమె. దీని కోసం ఆమె సీలింగ్ ఫ్యాన్ కు ఓ తాడు కడుతుంది. అప్పటికే ఐస్ క్రీమ్ కోసం సిద్ధం చేసుకున్న పదార్ధాన్ని ఓ క్యాన్ లో పోసి దానికి మూత పెట్టి ఈ ఓ పెద్ద డబ్బాలో ఆ క్యాన్ ను పెడుతుంది. ఈ తరువాత ఐస్ ముక్కల్ని డబ్బా లోపల క్యాన్ చుట్టూ ఏర్పాటు చేస్తుంది. తరువాత ఫ్యాన్ కు వేలాడదీసిన తాడుని క్యాను కు కట్టి ఫ్యాన్ స్విచ్ వేస్తుంది. అలా ఫ్యాన్ గాలి..క్యాన్ చుట్టు ఉన్న ఐస్ గడ్డల చల్లదనానికి ఐస్ క్రీమ్ గట్టి పడటానికి ఇటువంటి వినూత్న ఏర్పాట్లు చేసింది.

క్యాన్ ఫ్యాన్ కు కట్టిన తాడుకు కట్టటం వల్ల గిరగిరా తిరుగుతుంది. దీంతో క్యాను లోపల ఉన్న ద్రవ పదార్థం కాస్త గట్టిపడే వరకు అలాగే ప్రక్రియను కొనసాగించి కొంతసేపటికి క్యాన్ లో ఉన్న పదార్ధాన్ని చూడగా అది గట్టి పడినట్లుగా తెలుస్తోంది. అలా తయారైన ఐస్ క్రీమ్ ను కప్పులో పెట్టి ఇంట్లో వారికి అందించినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ఇటువంటి వినూత్న యత్నాలు భారతదేశంలో మాత్రమే ఉంటాయని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.