Mother-Innovative Backseat: కుమారుడిని సైకిల్‌పై తీసుకెళ్లడానికి కొత్త పద్ధతి కనిపెట్టిన మహిళ.. వీడియో వైరల్

సైకిల్ పై తన కుమారుడిని తనతో పాటే తీసుకెళ్లేందుకు వెనుక సీటుపై ఓ చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కట్టింది. ఆ కుర్చీలో తన కుమారుడిని కూర్చోబెట్టి సైకిల్ తొక్కుతూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు తమ స్మార్ట్ ఫోనులో తీశారు. తొమ్మిది క్షణాల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Mother-Innovative Backseat: కుమారుడిని సైకిల్‌పై తీసుకెళ్లడానికి కొత్త పద్ధతి కనిపెట్టిన మహిళ.. వీడియో వైరల్

Mother-Innovative Backseat: ఇంట్లో పసి పిల్లలు ఉంటే తల్లి ఎక్కడికెళ్లినా వారిని తీసుకెళ్లాల్సి వస్తుంది. కొందరు మహిళలు పనులకు నడుచుకుంటూ లేదా సైకిల్ పై వెళ్తుంటారు. దీంతో చిన్నారులను తమ వెంట తీసుకెళ్లడం కష్టం అవుతుంది. సైకిల్ వెనక చిన్నారులను కూర్చోబెడితే వారు కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ఓ తల్లి సైకిల్ పై తన కుమారుడిని తీసుకెళ్లడం కోసం చేసిన ప్రత్యేక ఏర్పాటు పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా దృష్టిని ఆకర్షించింది.

ఆ మహిళ సైకిల్ పై తన కుమారుడిని తీసుకెళ్లిన వీడియోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి పిల్లల కోసం తల్లి చేయని పని ఏం ఉంటుందని పేర్కొన్నారు. ఆ తల్లి సైకిల్ పై తన కుమారుడిని తనతో పాటే తీసుకెళ్లేందుకు వెనుక సీటుపై ఓ చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కట్టింది. ఆ కుర్చీలో తన కుమారుడిని కూర్చోబెట్టి సైకిల్ తొక్కుతూ వెళ్లింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు తమ స్మార్ట్ ఫోనులో తీశారు. తొమ్మిది క్షణాల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆ మహిళ సృజనాత్మకతకు సెల్యూట్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిన్నారి సౌకర్యవంతంగా సైకిల్ వెనుక సీట్లో కూర్చునేందుకు ఆమె కనిపెట్టిన ఈ పద్ధతి అద్భుతంగా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Rain alert for Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం