South Korea : 960 సార్లు పరీక్ష రాసి డ్రైవింగ్ లైసెన్స్‌ సాధించిన 69 ఏళ్ల మహిళ .. ఆమె పట్టుదలకు హ్యుందాయ్‌ కారు గిఫ్టు

960 సార్లు పరీక్ష రాసి లైసెన్స్‌ సాధించింది 69 ఏళ్ల మహిళ. . ఆమె పట్టుదలకు హ్యుందాయ్‌ సంస్థ కారు గిఫ్టుగా ఇచ్చింది

South Korea : 960 సార్లు పరీక్ష రాసి డ్రైవింగ్ లైసెన్స్‌ సాధించిన 69 ఏళ్ల మహిళ .. ఆమె పట్టుదలకు హ్యుందాయ్‌ కారు గిఫ్టు

woman passed 960th time driving test..Hyundai Car Gift

South Korea : తానే స్వయంగా కారు డ్రైవ్ చేయాలి. దాని కోసం లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు 10 కాదు 20 కూడా కాదు ఏకంగా 960 సార్లు ప్రయత్నించి ఎట్టకేలకు సాధించింది. ఆమె పట్టుదల ముందు అపజయాలన్ని సలామ్ చేశాయి. ప్రయత్నిస్తే..సాధించలేని ఏమీలేదని నిరూపించింది ఓ మహిళ. పట్టుదలతో 960సార్లు పరీక్ష రాసి డైవింగ్ లైసెన్స్ సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన ఆ మహిళ తాను ఎన్ని సార్లు విఫలం అయిన ప్రయత్నిస్తూ ఎట్టకేలకు విజయం సాధించింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అప్పటికి ఆమె వయస్సు 69 ఏళ్లు..! ఇది జరిగి 18 సంవత్సరాలు గడిచింది. ఓ వ్యక్తి ఆమె పట్టుదల గురించి రెడిట్ లో షేర్ చేయటంతో ఆమె పట్టుదల వైరల్ గా మారింది…!!

దక్షిణ కొరియాకు చెందిన చా సా-సూన్‌ అనే మహిళ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం మొదటిసారిగా 2005లో రాత పరీక్ష రాసి ఫెయిల్‌ అయింది. అలా ప్రతీసారీ పరీక్ష రాస్తూనే ఉంది. అలా మూడేళ్లపాట వారానికి ఐదు రోజులు 780 సార్లు పరీక్షలు రాసింది. కానీ ఫెయిల్ అవుతునే ఉంది. ఒక్కసారి ఓడిపోతేనే నిరాశ ఆవహిస్తుంది. కానీ చాసా మాత్రం ఓడిన ప్రతీసారి (ఫెయిన్ అయిన ప్రతీసారి) అంతకు మించిన పట్టుదలతో పరీక్ష రాస్తూనే ఉంది. కానీ ఫెయిల్ అవుతునే ఉంది. కానీ ఆమె ప్రయత్నం మాత్రం మానలేదు. వారానికి రెండు మూడు సార్లు రాస్తూనే ఉంది. చివరకు ప్రాక్టికల్‌ టెస్టులో 2010లో పాస్ అయ్యింది. పది సార్లు ప్రయత్నించి ప్రాక్టికల్‌ టెస్టులోనూ పాసైంది. అంతే చా సా-సూన్ ఆనందం అంతా ఇంతాకాదు.

అలా మొత్తం 960 ప్రయత్నాల తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందింది. అప్పటికి ఆమె వయసు 69 ఏళ్లు. ఈ ప్రక్రియలో ఎంతో డబ్బు కూడా ఖర్చు అయ్యింది. దాదాపు 11 వేల పౌండ్లు (రూ.11.16లక్షలు) ఖర్చు చేసింది. కానీ ఎంత డబ్బు ఖర్చు అయినా తాను డైవింగ్ లైసెన్స్ సాధించాలనే పట్టుదల ఎంతోమందికి (ఓటమితో నిరాశ చెందేవారికి) స్పూర్తినిచ్చిందనే చెప్పాలి. అలా ఆమె పట్టుదలకు.. సంకల్ప బలానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు చా సా-సూన్‌. అంతేకాదు ఆమె పట్టుదలను ప్రశంసిస్తూ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ ఓ కారును బహుమతిగా ఇచ్చింది.

ఆమె పరీక్ష రాయటానికి వందలసార్లు వెళ్లటం..ఫెయిల్ అవ్వటంతో డైవింగ్ స్కూల్ ట్రైనర్ కూడా నిరాశ పడ్డారు. కానీ ఎట్టకేలకు ఆమె పాస్ అయి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది ఆమెకు పూల బొకే అందించి ఆనందంగా కౌగలించుకున్నారు. మాకు పెద్ద భారం తొలగిపోయినట్లుగా అయ్యిందని తెలిపారు. ఆమె పట్టుదల మరోసారి వైరల్ కావటంతో నెటిజన్లు అపజయానికి నిరాశ చెందకుండా విజయం సాధించేవరకు కృషి చేయాలని ఆమె చా సా నిరూపించారని కామెంట్ చేశారు.