Siddipet Govt school : ఈ ప్రభుత్వ స్కూల్లో సీటు దొరకాలంటే అంత ఈజీ కాదు,మంత్రులు రికమెండేషన్ ఉన్నా కష్టమే..ఎందుకంత డిమాండ్..?
తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాల వెరీ వెరీ స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఈ స్కూల్లో సీటు కావాలంటే మంత్రులతో రికమెండ్ చేయించుకునేంత స్పెషల్. ఈ స్కూల్లో విద్యావిధానం అలాంటిది. ప్రైవేటు స్కూల్స్ తలదన్నేలా ఉంటుంది ఇక్కడి విద్యావిధానం.

Siddipet Government School
Siddipet Govt school : గవర్నమెంట్ స్కూల్ అంటే ఈరోజుల్లో అందరికి చిన్నచూపే. ఇంగ్లీషుల చదువులు కావాలంటే ప్రైవేట్ స్కూల్సే శరణ్యమనేలా ఉంది పరిస్థితి. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్న కాలమిది.. కానీ సిద్ధిపేట ఇందిరానగర్ పాఠశాల వెరీవెరీ స్పెషల్.. కార్పొరేట్ స్కూల్‌లో చదివే పిల్లలు కూడా టీసీలు తీసుకుని ఇందిరానగర్ స్కూల్‌లో సీట్ కోసం పైరవీలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు.. మంత్రులు వద్దకు వెళ్లి ఇందిరానగర్ స్కూల్ సీట్ ఇప్పించమని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఇందిరానగర్ ప్రభుత్వ బడిలో స్పెషల్ ఏంటి? ఆ స్కూల్‌లో అడ్మిషన్లకు ఎందుకంత పోటీ…?
సర్కారు బడి అర్థం మార్చారు సిద్ధిపేట ఇందిరానగర్ పాఠశాల ఉపాధ్యాయులు. చక్కటి వాతావరణం.. ఆధునిక భవనాలు.. అత్యాధునిక లాబోరేటరీలు.. మంచి బోధనతో ప్రైవేటు పాఠశాలను తలదన్నేలా ప్రభుత్వ బడిని మార్చేశారు. సమష్టిగా పనిచేసి ఉత్తమ బోధన అందిస్తుండటంతో ఇందినానగర్ పాఠశాలలో సీట్ల కోసం పైరవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన విద్యార్థులను చేర్చుకోలేక నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సివచ్చింది ఇందిరానగర్ పాఠశాలలో…
TSRTC: పల్లె వెలుగు ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”
సాధారణంగా ప్రభుత్వ బడుల నుంచి టీసీలు తీసుకుని.. ప్రైవేటు స్కూల్‌కు పరుగులు తీస్తుంటారు విద్యార్థులు. కాస్త స్థోమత ఉన్న వారు కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి పిల్లలను భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని భావిస్తుంటారు. కానీ, సిద్ధిపేట ప్రాంతంలో చాలా మంది ఇందిరానగర్ పాఠశాలలో సీట్ల కోసం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల నుంచి టీసీలు తీసుకుని వచ్చేస్తున్నారు. ఈ పాఠశాలలో సీటు ఇప్పించాల్సిందిగా.. స్థానిక శాసనసభ్యులు, మంత్రి హరీశ్‌రావు రికమెండేషన్ లెటర్ కోసం వత్తిడి వస్తుండంటే.. ఇందిరానగర్ పాఠశాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది.
నూటికి నూరు శాతం విద్యార్థుల ఉత్తీర్ణతతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ పాఠశాల ఉపాధ్యాయులు. 2015లో ఈ పాఠశాలలో మూడు వందల మంది విద్యార్థులు చదువుతుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 12 వందలకు పెరిగింది. 8 నుంచి 23 సెక్షన్లకు విస్తరించింది ఇందిరానగర్ పాఠశాల. ఈ స్కూల్‌లో చదువుకుంటున్న పిల్లలు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు..
ఇందిరానగర్ పాఠశాలకు స్థానికుల నుంచి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆధునిక విధానంలో విద్యా బోధన కొనసాగుతోంది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని కార్పొరేటు పాఠశాలకు దీటుగా అదనపు తరగతి గదులు, డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. అన్ని రకాల వసతులు ఉండటంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది ఇందిరానగర్ స్కూల్..
Hyderabad Metro: ఓల్డ్ సిటీకి మెట్రో రైల్‌పై అధికారుల కసరత్తు షురూ.. ఈ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు
ప్రయివేటు పాటశాలలకు దీటుగా పాఠ్య అంశాల బోధిస్తున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల క్రమశిక్షణగా ఉంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాలమైన మైదానం.. దృశ్య, శ్రవణ విధానం (Visual and auditory system)లో పాఠాలు బోధిస్తుండటం వల్ల పాఠాలు చక్కగా అర్థం అవుతున్నాయని.. తాము ప్రైవేటు పాఠశాలలో చదువుకుని… ఇక్కడ చేరామని అక్కడి కన్నా ఇక్కడే బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పిల్లలు. ఏదిఏమైనా ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న చెడ్డ అభిప్రాయాన్ని తుడిచేసేలా పనిచేస్తున్న ఇందిరానగర్ ఉపాధ్యాయుల సమష్టి కృషి అభినందనీయం.. ఇలా ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయులు పనిచేస్తే కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతాయని అంటున్నారు తల్లిదండ్రులు.