Maharashtra Politics: మహా వికాస్ అఘాడీ పార్టీలకు ఓటమి తప్పదు.. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ హాట్ కామెంట్స్

మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమిలో భారతీయ జనతా పార్టీ, శివసేన (షిండే కూటమి) ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిని ఓడించాలని ఎంవీఏ నేతలు తరుచూ చెబుతున్నారు

Maharashtra Politics: మహా వికాస్ అఘాడీ పార్టీలకు ఓటమి తప్పదు.. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ హాట్ కామెంట్స్

Maha Vikas Aghadi: వచ్చే ఏడాది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలకు చాలా కీలకమైన సంవత్సరం. ఎందుకంటే.. రెండు కీలక ఎన్నికలు ఆరు నెలల వ్యవధితో జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, అనంతరం నాలుగు నెలలకే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ పార్టీలు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే దారుణంగా ఓడిపోయే అవకాశం ఉందని అన్నారు. కలిసికట్టుగా ఎన్నికలకు పోతే బీజేపీ-శివసేన కూటమిని ఎదుర్కోగలమని ఆయన అన్నారు.

Karnataka: సావర్కర్, హెగ్డేవార్ పాఠాలు తొలగిస్తారా? కర్ణాటక సీఎం ఏం అన్నారు?

సోమవారం పూణెలో నిర్వహించిన సమావేశంలో అజిత్ పవార్ మాట్లాడుతూ ‘‘మహా వికాస్ అఘాడీలోని ప్రధాన నాయకులు వచ్చే లోక్‭సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిసి కట్టుగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. పరిస్థితులు ఎలాంటివైనా మనమందరం కలిసికట్టుగా ఉండాలి. తమ సొంత పార్టీ వ్యక్తి ఇతర పార్టీ వ్యక్తి అనే బేషజాలం లేకుండా గెలిచే అభ్యర్థుల్ని నిలిపేందుకు, వారిని గెలిపించేందుకు ఎంవీఏ నేతలు ఒప్పందం చేసుకోవాలి. విపక్ష కూటమికి వ్యతిరేకంగా ఎంవీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎలా పెంచుకోవాలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతి పార్టీ దీనిపై పని చేయాలి’’ అని అన్నారు.

Gehlot and Pilot: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముందు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కుదిరిన ఒప్పందం

మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమిలో భారతీయ జనతా పార్టీ, శివసేన (షిండే కూటమి) ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిని ఓడించాలని ఎంవీఏ నేతలు తరుచూ చెబుతున్నారు. అందుకు ఒంటరిగా పోటీ చేయవద్దని అజిత్ పేర్కొన్నారు. ‘‘లోక్‭సభ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా ఒంటరిగా వెళ్తే మహా వికాస్ అఘాడీలోని పార్టీలు ఓటమి పాలైతాయి. ఇది అన్ని పార్టీ అంగీకరించాల్సిందే. అందుకే అధికార కూటమిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లేందుకు అందరూ సిద్ధం కావాలి’’ అని అజిత్ పవార్ అన్నారు.