దూరం..కాదిక భారం : హైదరాబాద్‌లో అద్భుతమైన బ్రిడ్జి

  • Published By: madhu ,Published On : November 18, 2019 / 12:27 AM IST
దూరం..కాదిక భారం : హైదరాబాద్‌లో అద్భుతమైన బ్రిడ్జి

ఒక ఓఆర్ఆర్.. ఓ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే.. తాజాగా.. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్.. వీటన్నింటిని మించి.. హైదరాబాద్‌లో మరో అద్భుతమైన బ్రిడ్జి నిర్మితమవుతోంది. 
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.. హైదరాబాద్‍‌‌లో అద్భుత కట్టడంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓ వీడియోతో పాటు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ బ్రిడ్జి.. నగర వాసులకు రవాణాను తేలిక చేయనుందని కేటీఆర్ తెలిపారు. 

ఇప్పటికే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. దీంతో ఈ ప్రాంత పరిసరాలన్ని సరికొత్తగా కనువిందు చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ షేర్ ఈ ఫోటోలు, వీడియోలు చూస్తుంటే.. విదేశాలను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే టెక్నాలజీతో చేపడుతున్న నిర్మాణ పనుల్లో శనివారం రెండు సెగ్మెంట్లను రెండున్నర గంటల్లో అమర్చి రికార్డు సృష్టించారు.
Read More : ఆ గర్భవతి మా అమ్మే.. కడుపులో ఉన్నది నేనే – చిరంజీవి
మరికొన్ని రోజుల్లోనే పనులు పూర్తికానున్నాయి. తర్వాత.. ఎలక్ట్రిఫికేషన్‌ పనులు చేపడతారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి.. ఐటీ కారిడార్‌కు రాకపోకలు సులువు అవుతాయి. అంతేగాకుండా..హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని అంచనా వేస్తున్నారు. దుర్గం చెరువు రెండు వైపులా..రూపురేఖలు ఈ ప్రాజెక్టుతో మారిపోనున్నాయి. అంతేగాకుండా..అరుదైన జాతి మొక్కలను పెంచి గ్రీన్ రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.