మద్యాన్ని నిషేధించాలి : ముగిసిన డీకే అరుణ రెండు రోజుల దీక్ష

  • Published By: madhu ,Published On : December 13, 2019 / 01:48 PM IST
మద్యాన్ని నిషేధించాలి : ముగిసిన డీకే అరుణ రెండు రోజుల దీక్ష

మహిళా సంకల్ప దీక్షను మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ విరమించారు. మద్యాన్ని నిషేధించాలని ఈమె రెండు రోజుల పాటు దీక్ష చేశారు. 2019, డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం దీక్షను ముగించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, దిశా ఘటనతోనైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలన్నారు. 
మద్యంపై ఉద్యమాన్ని జిల్లా స్థాయికి తీసుకెళుతామని వెల్లడించారు.

బెల్టు షాపులను తొలగించకపోతే..తామే తొలగిస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. హైవే పక్కన మద్యం షాపులను తొలగించాలని, పర్మిట్ రూంలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు. కాలేజీల్లో చదివే విద్యార్థులను చైతన్యపరుస్తామని తెలిపారు. 

కాంగ్రెస్ నేతగా డీకే అరుణ..ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పరాజయం పొందారు. గద్వాల సెగ్మెంట్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బండ కృష్ణమోహన్ చేతిలో పరాజయం చెందారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నేతలకు కాన్ఫిడెన్ష్‌ను చంపేశాయి. దీంతో పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. డీకే అరుణ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. అనంతరం అనూహ్యంగా బీజేపీ కండువా కప్పుకున్నారామె. 
Read More :దిశా నిందితుల ఎన్ కౌంటర్ : అప్పటి వరకు మృతదేహాలు తీసుకోం