అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలంటే క్షమాపణ చెప్తా

అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలు అంటే తాను క్షమాపణ చెప్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 10:26 AM IST
అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలంటే క్షమాపణ చెప్తా

అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలు అంటే తాను క్షమాపణ చెప్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలు అంటే తాను క్షమాపణ చెప్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గురువారం (డిసెంబర్ 5, 2019) విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సంపద సృష్టి, ఉపాధి కల్పన లక్ష్యంగా అమరావతిని నిర్మాంచాలనుకున్నామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పవల్లి అమరావతి అని అభివర్ణించారు. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. 

జగన్ చెప్పిన మాటలనే ఆయన అమలు చేసే పరిస్థితిలో లేడని విమర్శించారు. రాష్ట్ర విభజన చేసేటప్పుడు అమరావతి రాజధానిని డిసైడ్ చేయలేదన్నారు. అమరావతి రాజధానిని కొత్త రాష్ట్రానికి డిసైడ్ చేయకుండా రాష్ట్రాన్ని డివైడ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నారు. శివరామకృష్ణయ్య కమిటీ వేశారని తెలిపారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, ఒంగోలు, దొనకొండతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆయన ప్రజాభిప్రాయం తీసుకున్నారని తెలిపారు. 

ఏసీ కూడా అండర్ గ్రౌండ్ లో తీసుకొచ్చామని చెప్పారు. రోడ్లన్ని రెడీ అయిపోయాయని తెలిపారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి, విడి విడిగా చూస్తే 4700 మందిలో 2191 మంది అమరావతిలో రాజధానిలో ఉండాలని చెప్పారని గుర్తు చేశారు. మెజారిటీ మంది చెప్పిన ప్రాంతం అమరావతి అని తెలిపారు. అందరూ ఒప్పుకున్న ప్రాంతం, సమదూరం ఉన్న ప్రాంతం అమరావతి అని చెప్పారు.