రాజావారి రుచులు బిర్యానీలో ఐరన్ వైర్..రూ. 5 వేల ఫైన్

  • Published By: madhu ,Published On : January 18, 2020 / 01:15 AM IST
రాజావారి రుచులు బిర్యానీలో ఐరన్ వైర్..రూ. 5 వేల ఫైన్

ప్రముఖ హోటల్‌లో ఒకటైన రాజావారి రుచుల బిర్యానీలో ఐరన్ వైర్ రావడంతో షాక్‌కు గురయ్యాడు ఓ వినియోగదారుడు. వెంటనే దానికి సంబంధించిన ఫొటో తీసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. zckukatpally, GHMCOnline హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఇంకేముంది..వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించారు. హోటల్‌ను పరిశీలించి..రూ. 5వేల ఫైన్ వేశారు. ఈ ఘటన కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే…జనవరి 15వ తేదీ బుధవారం కూకట్ పల్లిలో ఉన్న రాజావారి రుచుల హోటల్ నుంచి చికెన్ బిర్యానీ, కర్డ్ రైస్ జోమాటోకు ఆర్డర్ ఇచ్చానని శ్రీనివాస్ బెల్లం వెల్లడించారు. అనంతరం డెలివరీ బాయ్ వచ్చి ఆహారం ఇచ్చి వెళ్లడం జరిగిందన్నారు. అనంతరం బిర్యానీ తింటుండగా..నోటికి ఏదో అడ్డుగా వచ్చినట్లు అనిపించిందని..వెంటనే బయటకు తీయగా అది ఐరన్ వైర్ అని తెలిపారు. వెంటనే దాని ఫొటో తీసి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసినట్లు వెల్లడించారు. 

GHMC జోనల్ కమిషనర్ వి.మమత రెస్పాండ్ అయ్యారు. పరిశీలించి యాక్షన్ తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం ఒక టీంను హోటల్‌కు పంపించారు. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సమాచారం, పరిష్కార కేంద్రం స్పందించింది. ఘటనకు సంబంధించి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని శ్రీనివాస్‌కు సూచించింది.

తమ కార్యాలయానికి రావాలని, మరింత సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0333కు కాల్ చేయాలని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. దీనిపై జొమాటో సారీ చెప్పినట్లు, డిస్కౌంట్ కూపన్ తనకు ఇచ్చారని శ్రీనివాస్ వెల్లడించారు. 

Read More : 20న ఏపీ కేబినెట్ మీటింగ్ – రైతులు..రైతు కూలీలకు సాయం రెట్టింపు!

2019, అక్టోబర్ నెలలో బిర్యానీలో ఫేమస్ అయిన ప్యారడైజ్, కేఫ్ బెహర్ హోటల్స్‌కు  GHMC జరిమాన విధించిన సంగతి తెలిసిందే. పరిశుభ్రమైన ఆహారం అందిస్తుందా లేదా అని పరిశీలించారు అధికారులు. బిర్యానీలో వెంట్రుకలు వచ్చినట్లు కస్టమర్ అందించిన ఫిర్యాదు మేరకు ప్యారడైజ్ హోటల్ కిచెన్‌ను పరిశీలించారు.