బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తెలుగు మహిళానేతలు

  • Published By: sreehari ,Published On : September 26, 2020 / 05:11 PM IST
బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తెలుగు మహిళానేతలు

BJP’s national office-bearers: భారతీయ జనతాపార్టీ జాతీయ నూతన కార్యవర్గం తెలుగు రాష్ట్రాల మహిళానేతలను అందలమెక్కించింది. కాంగ్రెస్ నుంచి బీజేపీకెళ్లిన ఫైర్‌బ్రాండ్ డికె అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.

సీనియర్ నేత పురందేశ్వరినీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరూ వాగ్ధాటి ఉన్నవాళ్లే. రెండురాష్ట్రాల్లోనూ సొంత వాయిస్‌ను వినిపించగలిగేవాళ్లే.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షడికి ఓబీసీ మోర్చా అధ్యక్షపదవిని అప్పగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

జాతీయ కార్యరవర్గంలో మొత్తంమీద నలుగురు తెలుగు నేతలకు చోటిచ్చారు. కాకపోతే మురళీధర్ రావు, రాంమాధవ్‌లను జాబితా నుంచి తప్పించారు. ఇది ముందు ఊహించిందే. రాజ్యసభ ఎంసి జీవిఎల్‌ను అధికార ప్రతినిధి జాబితా నుంచి తప్పించారు. ఇది అనూహ్యం.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అన్ని సమీకరణాలకు సర్దుబాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టీంను ఎంచుకున్నారు. ఫైర్ బ్రాండ్ లను నమ్ముకున్నారు. పార్టీలో సమూలమార్పులకు సన్నాహంగా 23 మంది జాతీయ ప్రతినిధులను కొత్తగా నియమించారు.

బెంగుళూరు ఎం Tejaswi Suryaను పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. Poonam Mahajanను తప్పించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా Raman Singh, Mukul Roy, Baijayant Jay Pandaలకు అవకాశమిచ్చారు.