నియోజకవర్గానికి రూ.100కోట్లు : కేఏ పాల్ సంచలనం

  • Edited By: veegamteam , January 7, 2019 / 04:07 PM IST
నియోజకవర్గానికి రూ.100కోట్లు : కేఏ పాల్ సంచలనం

రాజమండ్రి: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. 10వేల మంది ఓటర్లను పార్టీలో చేర్పించిన వారికే పార్టీ టికెట్ ఇస్తామన్నారు. పార్టీలో వెయ్యి మందిని చేర్పించిన వారికి రూ.3 వేల చొప్పున ఇస్తానని ప్రకటించారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే యోచన లేదని.. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే మార్చిలో ఆలోచిస్తామని చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుందన్నారాయన. అంతేకాదు తమ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గానికి రూ.100 కోట్లు చొప్పున విరాళం ఇస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. రానున్న 20 రోజుల్లో తమ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమాగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని… పెద్ద నోట్ల ముసుగులో దేశంలో భారీ అవినీతి జరిగిందని కేఏ పాల్ ఆరోపించారు. అన్ని మతాల వారు భయంతో బతుకుతున్నారని వాపోయారు.