Bihar Politics: దీరేంద్ర శాస్త్రి బాబా ‘హిందూ రాష్ట్ర’ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ విమర్శలు

స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఏర్పడిన రాజ్యాంగం అందరికీ ఆమోదయోగ్యంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఇలా చెబుతున్న వాళ్లంతా స్వాతంత్య్ర పోరాటంలో పుట్టారా? ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ మతమైనా కావొచ్చు. కానీ పేర్లు మార్చే ప్రతిపాదనలే ఆశ్చర్యంగా ఉన్నాయి

Bihar Politics: దీరేంద్ర శాస్త్రి బాబా ‘హిందూ రాష్ట్ర’ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ విమర్శలు

Nitish Kumar: ‘బిహార్ నుంచి హిందూ రాష్ట్రం మండుతూ పైకి లేస్తుంది’ అంటూ స్వయంప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అకా బాగేశ్వర్ ధామ్ సర్కార్‌ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. హిందూ రాష్ట్రం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులు రాజ్యాంగం వచ్చినప్పుడు కూడా పుట్టలేదని నితీశ్ అన్నారు. అయితే ‘బాబా బాగేశ్వర్’ ఐదు రోజుల సభ కోసం బీహార్‌ రాజధాని పాట్నాకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ రాష్ట్ర ప్రస్తావన తెచ్చారు. హిందూ రాష్ట్రం బిహార్ నుంచే ఉద్భవిస్తుందని, బిహార్ నుంచి ఎగిసిపడే నిప్పులే దేశంలో హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Madhya Pradesh : మూడో భార్య చెప్పిందని.. మొదటి భార్య కొడుకును హత్య చేసిన వ్యక్తి

ఇక దీనిపై నితీశ్ కుమార్ మాట్లాడుతూ ‘‘స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఏర్పడిన రాజ్యాంగం అందరికీ ఆమోదయోగ్యంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఇలా చెబుతున్న వాళ్లంతా స్వాతంత్య్ర పోరాటంలో పుట్టారా? ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ మతమైనా కావొచ్చు. కానీ పేర్లు మార్చే ప్రతిపాదనలే ఆశ్చర్యంగా ఉన్నాయి. అది కూడా సాధ్యమేనా?’’ అని నితీశ్ అన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని, గౌరవించాలని అన్నారు. ఇక రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ బాగేశ్వర్ ఎవరని ప్రశ్నించారు.

Karnataka Politics: ఏంటి.. సిద్ధరామయ్య సీఎం కాదా? ఇంతకీ ఢిల్లీ పెద్ద మనిషి ఏం చెప్పారంటే?