Karnataka Politics: ఏంటి.. సిద్ధరామయ్య సీఎం కాదా? ఇంతకీ ఢిల్లీ పెద్ద మనిషి ఏం చెప్పారంటే?

ఈరోజు ఉదయం నుంచే సిద్ధరామయ్య ఎంపిక ఖాయమైందంటూ దేశ మీడియా కోడై కూసింది. అంతే కాదు, బెంగళూరులోని ఆయన నివాసం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెప్పారు

Karnataka Politics: ఏంటి.. సిద్ధరామయ్య సీఎం కాదా? ఇంతకీ ఢిల్లీ పెద్ద మనిషి ఏం చెప్పారంటే?

Siddaramaiah: ‘కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే (Siddaramaiah)’.. బుధవారం సాయంత్రం నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థల్లో ఇదే వార్త తిరగేసి, మరగేసి ప్రచారం అవుతోంది. గత మూడు రోజులుగా (ఎన్నికల తుది ఫలితాలు వెలువడిన అనంతరం) ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠ ఇక ఎగిరిపోయిందని అనుకున్నారు. సీనియర్ నేతకే మొగ్గు చూపారని, జనరంజక ముఖ్యమంత్రినే ఎంపిక చేశారంటూ ఊదగొట్టారు. అయితే ఇంతలో కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా (Randeep Surjewala) ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

Chandra Babu : నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్ .. కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం

ముఖ్యమంత్రిపై పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒక నిర్ణయానికి రాగానే వెంటనే తెలియజేస్తామని మీడియాతో అన్నారు. సాధ్యమైనంత తొందర్లోనే ఒక నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే చెప్పారని, ప్రస్తుతం ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయడం కానీ, వదంతులు వ్యాప్తి చేయడం కానీ చేయవద్దంటూ కోరారు. రాబోయే 48 నుంచి 72 గంటల్లో కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని సూర్జేవాలా వివరించారు.

Bengaluru : బెంగళూరులో ఉబెర్ ఆటో బుక్ చేసుకున్నారా? ఇక గమ్యస్ధానానికి చేరినట్లే..

బహుశా.. ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీ నుంచి కావాలనే జరిగినట్టు కొందరు అంటున్నారు. ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరి పేరు ప్రకటిస్తే ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని తెలుసుకునేందుకే ఇలా చేశారని అంటున్నారు. సిద్ధరామయ్య పేరు లీక్ చేసి ఒక ట్రయల్ చేశారని, డీకే పేరు కూడా ఇలాగే లీక్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలను కూడా పరిగణలోకి తీసుకుంటారట.

Karnataka Politics: ఈ ఎన్నికల్లోనే కాదు 2018లో కూడా అవే చివరి ఎన్నికలన్న సిద్ధారామయ్య, 2013లో కూడా అదే మాట

ఇకపోతే, ఈరోజు ఉదయం నుంచే సిద్ధరామయ్య ఎంపిక ఖాయమైందంటూ దేశ మీడియా కోడై కూసింది. అంతే కాదు, బెంగళూరులోని ఆయన నివాసం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెప్పారు. బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసం వద్ద అభిమానులు ఆయన బ్యానర్లకు పాలాభిషేకం చేయగా, సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్ అభిమానులు ఢిల్లీలోని రాహుల్ నివాసం వెలుపల గుమిగూడారు.