ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరండి : సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు.

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 07:45 AM IST
ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరండి : సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు.

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు కోసం లోక్ సభలో పట్టుబట్టాలని సూచించారు. తెలంగాణలో ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని గతంలో తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని.. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపిందని ఆయన తెలిపారు. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాల్సివుందన్నారు.

ఈబీసీ బిల్లులో తెలంగాణ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు కోసం లోక్ సభలో పట్టుబట్టాలని ఎంపీలకు కేసీఆర్ సూచించారు. బిల్లులో సవరణ బిల్లు రాష్ట్ర డిమాండ్ ను నెరవేర్చేలా పట్టుబట్టాలని ఆదేశించారు. 

2019 ఎన్నికలకు ముందు అగ్రకులాల ఓట్లకు మోడీ సర్కార్ రిజర్వేషన్ వల వేసింది. అగ్రకులాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు జనవరి 7న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 15, 16 ను సవరించడం ద్వారా జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి.