Gujarat Polls: ఆప్‭ను అర్బన్ నక్సల్స్‭తో పోలుస్తూ విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

అర్బన్ నక్సల్స్ కొత్త ముఖాలతో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఒకప్పటిలా కాకుండా పూర్తిగా వేరే వేషంలో ఉన్నారు. ముఖ్యంగా యువతకు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మన యువతరం తప్పుదోవ పట్టకుండా మనం కాపాడుకోవాలి. అర్బన్ నక్సల్స్‮‭కి లొంగిపోయి దేశ వినాశనానికి కారణం కాకుండా మన పిల్లలకు యువతకు మనం హెచ్చరికలు చేయాలి

Gujarat Polls: ఆప్‭ను అర్బన్ నక్సల్స్‭తో పోలుస్తూ విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

PM Modi indirectly calls aap as urban naxals

Gujarat Polls: ఆమ్ ఆద్మీ పార్టీని అర్బన్ నక్సల్స్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్త ముసుగులతో రాష్ట్రంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, కానీ గుజరాతీలు వారిని అనుమతించరని అన్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. సోమవారం బరూచ్‭లో దేశంలో మొట్టమొదటి బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు.

‘‘అర్బన్ నక్సల్స్ కొత్త ముఖాలతో రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఒకప్పటిలా కాకుండా పూర్తిగా వేరే వేషంలో ఉన్నారు. ముఖ్యంగా యువతకు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మన యువతరం తప్పుదోవ పట్టకుండా మనం కాపాడుకోవాలి. అర్బన్ నక్సల్స్‮‭కి లొంగిపోయి దేశ వినాశనానికి కారణం కాకుండా మన పిల్లలకు యువతకు మనం హెచ్చరికలు చేయాలి. విదేశీ శక్తులకు వారు ఏజెంట్లు. కానీ అలాంటి వారిని గుజరాత్ ఎప్పటికీ అనుమతించదు’’ అని మోదీ అన్నారు.

కొద్ది రోజుల క్రితం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్.. అదే ఊపుతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టింది. ఆ ఉత్సాహాన్నే ఇక్కడా కొనసాగించింది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది. ఉదృత ప్రచారంతో దూసుకుపోతోంది. పేరు బయటికి చెప్పకపోయినా.. ఆప్ దూకుడును ఉద్దేశించే మోదీ పై విధంగా విమర్శలు గుప్పించారు.

Rajastan: కాంగ్రెస్‭లోని రెండు వర్గాల వైరంపై రాజస్తాన్ మాజీ సీఎం రాజే స్పందన