పొలిటికల్‌ జేఏసీ హైవే దిగ్బంధంపై ఆంక్షలు : అర్ధరాత్రి నుంచే ముఖ్యనేతల హౌస్‌ అరెస్ట్

హై పవర్‌ కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 01:47 AM IST
పొలిటికల్‌ జేఏసీ హైవే దిగ్బంధంపై ఆంక్షలు : అర్ధరాత్రి నుంచే ముఖ్యనేతల హౌస్‌ అరెస్ట్

హై పవర్‌ కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

హై పవర్‌ కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రహదారుల దిగ్బంధించాలని పిలుపిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పొలిటికల్‌ జేఏసీ హైవే దిగ్బంధంపై ఆంక్షలు విధించారు. 

పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున నిరసనలకు అనుమతి నిరాకరించారు. అర్ధరాత్రి నుంచే ముఖ్యనేతలను హౌస్‌ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ను హౌస్‌ అరెస్ట్ చేశారు. 

హై పవర్‌ కమిటీ సమావేశానికి నిరసనగా హైవేల దిగ్బంధానికి జేఏసీ సిద్ధమైంది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు.