Rajasthan: సొంత పార్టీ నుంచే మంత్రికి ఘోర అవమానం.. సభలో మాట్లాడుతుండగా చెప్పులు విసిరిన పైలట్ మద్దతుదారులు

ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా సచిన్ పైలట్ మద్దతుదారులు చెప్పులు విసిరారు. గుంపులో ఉన్న కొంతమంది ఒక్కసారిగా పైలట్‭కు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ వెంటనే వెనకాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అశోక్ చంద్రపై చెప్పులు విసిరారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై చెప్పులు విసిరితే సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతారనుకుంటే, ఇప్పుడే ఆయనను ముఖ్యమంత్రి చేయొచ్చని అన్నారు.

Rajasthan: సొంత పార్టీ నుంచే మంత్రికి ఘోర అవమానం.. సభలో మాట్లాడుతుండగా చెప్పులు విసిరిన పైలట్ మద్దతుదారులు

Rajasthan minister attacks Sachin Pilot after shoes hurled

Rajasthan: రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్‭కు ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018లో జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంలో ప్రధాన పాత్ర పైలటేనని, ఆయనపై విశ్వాసంతోనే ఎక్కువ ఓట్లు వచ్చాయని కూడా అంటుంటారు. ఆయనకు అభిమానులు ఎక్కువ. వారి అభిలాష సచిన్ పైలట్ ముఖ్యమంత్రి కావడం. కానీ పైలట్ ముఖ్యమంత్రి కాలేదన్న ఆవేశం వారిలో ఎక్కువగా ఉంది. ఒక్కోసారి ఇది బయటికి వచ్చి కొన్ని తప్పుడు చర్యలకు దారి తీస్తోంది.

తాజా, ఈ ప్రభావం వల్ల రాజస్తాన్ క్రీడా మంత్రి అశోక్ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా సచిన్ పైలట్ మద్దతుదారులు చెప్పులు విసిరారు. గుంపులో ఉన్న కొంతమంది ఒక్కసారిగా పైలట్‭కు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ వెంటనే వెనకాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అశోక్ చంద్రపై చెప్పులు విసిరారు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై చెప్పులు విసిరితే సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతారనుకుంటే, ఇప్పుడే ఆయనను ముఖ్యమంత్రి చేయొచ్చని అన్నారు.

HD Kumaraswamy: మా డబ్డులతో హిందీ భాషా దినోత్సవం చేయాల్సిన అవసరం లేదు

కాగా, తాజారా రాష్ట్రంలో ఓ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. దీనికి లోక్‭సభ స్పీకర్ ఓం బిర్లా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పునియా, కాంగ్రెస్ ఎమ్మెల్యే-మంత్రి శకుంతల రావత్, మంత్రి అశోక్ చంద్ర పాల్గొన్నారు. ఇరు పార్టీల నేతలు రావడంతో ఇరు పార్టీల సానుభూతి పరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఇక కార్యక్రమాన్ని ఉద్దేశించి అశోక్ చంద్ర ప్రసంగిస్తుండగానే చెప్పులు విసిరారు. తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనంతరం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన స్పందిస్తూ ‘‘నాపై చెప్పులు విసిరితే సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అవుతారనుకుంటే వెంటనే అతడిని ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకంటే ఈరోజు నేను పోరాటం చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ నేను పోరాటం చేయాల్సిన రోజు వచ్చినప్పుడు ఒక్కరు మాత్రమే మిగిలిపోతారు. కానీ నేను అది కోరుకోవడం లేదు’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

ఇంకో ట్వీట్‭లో ఆయన స్పందిస్తూ ‘‘72 మందిని చంపడానికి ఆదేశాలు ఇచ్చిన రాజేంద్ర రాథోడ్(మాజీ మంత్రి) వేదికపైకి వచ్చినప్పుడు చప్పట్లు వచ్చాయి, అదే గుర్జర్ రిజర్వేషన్ కోసం జైలుకు వెళ్లిన నాకు చెప్పులు వచ్చాయి’’ అని రాసుకొచ్చారు. అయితే గుర్జర్ కమ్యూనిటీకి చెందిన పైలట్‭ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడాన్ని ఆ కమ్యూనిటీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే సభ కొనసాగుతుండగానే ‘సచిన్ పైలట్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అందులో గుర్తు తెలియని వ్యక్తులు బూట్లు, చెప్పలు వేదికపైకి విసిరారు.

BJP vs Nitish: నితీశ్‭కు మరోసారి షాకిచ్చిన బీజేపీ.. అరుణాచల్, మణిపూర్‭లలో జరిగిందే మళ్లీ రిపీట్