వీణా – వాణి :  10th Class హాల్ టికెట్లు ఒకటా ? రెండా ? 

  • Published By: madhu ,Published On : December 24, 2019 / 10:36 AM IST
వీణా – వాణి :  10th Class హాల్ టికెట్లు ఒకటా ? రెండా ? 

అవిభక్త కవలలు.. వీణా, వాణీల పదో తరగతి పరీక్షకు చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటివరకు హోం ట్యూటర్ సాయంతో చదివిన వీణా, వాణీలు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ పరీక్షకు రెండు హాల్ టికెట్స్ ఇవ్వాలా.. ఇద్దరికీ కలిపి ఒకటే ఇవ్వాలా అనే దానిపై అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

 

హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో.. స్పెషల్ కేసు కింద వీళ్లిద్దరూ పదో తరగతిలో చేరారు. దీంతో.. ఇద్దరికీ విడివిడిగా హాల్ టికెట్స్ ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు హైదరాబాద్ డీఈవో వెంకటనర్సమ్మ. వీణా-వాణీలు నేరుగా పదో తరగతి చదువుకునేందుకు అవకాశమివ్వాలని.. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు.

వేర్వేరుగా హాల్ టికెట్ల ఇచ్చేందుకు.. రాష్ట్ర విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ కోసం హైదరాబాద్ అధికారులు వేచి చూస్తున్నారు. ఇదేమంత పెద్ద సమస్య కాదని.. ఇద్దరికీ వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చేందు సిద్ధమయ్యామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

 

* 2002 నుంచి.. వీణా – వాణీలు నీలోఫర్ ఆస్పత్రిలో పెరిగారు. 
* రెండేళ్ల నుంచి.. స్టేట్ హోంలో ఉంటున్నారు. 
* ఇక్కడే వారికి ట్యూటర్‌ని ఏర్పాటు చేసి..మహిళా శిశు సంక్షేమ శాఖ విద్యాబోధన అందజేసింది. 
 

* ఇద్దరికీ టెన్త్ అడ్మిషన్ ఇవ్వొచ్చని తెలియజేస్తూ.. కమిటీ అధికారులకు రిపోర్ట్ ఇచ్చింది. 
* హైదరాబాద్ డీఈవో వెంకటనర్సమ్మ.. ప్రభుత్వ పరీక్ష విభాగం డైరెక్టర్‌కి లేఖ రాశారు. పాఠశాల విద్యాశాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలని సూచించడంతో.. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కి లేఖ రాశారు డీఈవో. 
* వారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read More : నో ఈవీఎం..ఓన్లీ బ్యాలెట్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు