ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా విశ్వజిత్‌

  • Published By: vamsi ,Published On : March 31, 2019 / 12:33 AM IST
ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా విశ్వజిత్‌

ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. విశ్వజిత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. విశ్వజిత్‌ 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న విశ్వజిత్‌ ఇకపై ఏపీకి నిఘా విభాగం అధిపతిగా వ్యవహరించనున్నారు.

వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రేసులో 1992 బ్యాచ్‌కు చెందిన న‌ళినీ ప్ర‌భాత్, 1994 బ్యాచ్‌కు చెందిన కుమార్ విశ్వ‌జిత్, 1998 బ్యాచ్‌కు చెందిన మ‌హేష్ చంద్ర ల‌డ్డాలు ఉండగా.. చివరకు విశ్వజీత్‌కు అవకాశం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా ముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపగా..  కొత్త డీజీ నియామకంపై కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది ఎన్నికల సంఘం.