అటు సినిమాలు, ఇటు రాజకీయాలు : అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?

తానున్నది అక్కడ.. ఆలోచనలన్నీ ఇక్కడ.. ఒక్కోసారి తానున్నది ఇక్కడ.. ఆలోచనలన్నీ అక్కడ.. ఇక్కడున్న వ్యక్తికి అక్కడి ఆలోచనలెందుకు? ఒకవేళ అక్కడే

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 02:53 PM IST
అటు సినిమాలు, ఇటు రాజకీయాలు : అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?

తానున్నది అక్కడ.. ఆలోచనలన్నీ ఇక్కడ.. ఒక్కోసారి తానున్నది ఇక్కడ.. ఆలోచనలన్నీ అక్కడ.. ఇక్కడున్న వ్యక్తికి అక్కడి ఆలోచనలెందుకు? ఒకవేళ అక్కడే

తానున్నది అక్కడ.. ఆలోచనలన్నీ ఇక్కడ.. ఒక్కోసారి తానున్నది ఇక్కడ.. ఆలోచనలన్నీ అక్కడ.. ఇక్కడున్న వ్యక్తికి అక్కడి ఆలోచనలెందుకు? ఒకవేళ అక్కడే ఉన్నాడనుకుందాం.. ఆలోచనలు ఇక్కడెందుకు? ఎందుకంటే.. ఇక్కడ చేస్తున్నది పాలిటిక్స్‌.. మరి పాలిటిక్స్‌ వదిలి ఆలోచనలు అక్కడెందుకు? ఎందుకంటే.. అక్కడ చేస్తున్నది సినిమాలు. అక్కడా ఇక్కడా ఏంటీ కన్‌ ఫ్యూజన్‌ అనుకుంటున్నారా? అక్కడున్న వ్యక్తీ ఇక్కడున్న వ్యక్తీ ఒక్కరే.. ఆయనకు అక్కడా ఇక్కడా రెండూ ముఖ్యమే. అక్కడ ఉన్నాడు కాబట్టే ఇక్కడ క్రేజ్‌.. ఇక్కడ ఉన్నాడు కాబట్టే అక్కడ మరింత క్రేజ్‌. మొత్తానికి ఆయన స్థిరంగా ఎక్కడుంటాడంటారన్నదే ఇప్పుడు ప్రశ్న.

రెండు పడవలపై పవన్ ప్రయాణం:
మొన్నటి వరకూ రాజకీయాల్లో కాస్త బిజీగా కనిపించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయారు. ప్రస్తుతం పింక్‌ సినిమా రీమేక్‌లో నటిస్తోన్న ఆయన.. ఆ తర్వాత వరుసగా మరో రెండు సినిమాలకు చేసేందుకు అంగీకారం తెలిపారు. పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే రెండు పడవల ప్రయాణం చేస్తారని అంటారు. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలెన్సింగ్‌ చేసుకుంటూ ముందుకెళ్లాలని ఇప్పుడు ఫిక్సయ్యారట. ఉదయం సినిమా షూటింగ్‌లు.. సాయంత్రాలు రాజకీయాలకు సంబంధించిన అప్‌ డేట్స్ తెలుసుకొనే పనిలో ఉంటున్నారాయన. ప్రస్తుతం వకీల్‌ సాబ్‌ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న పవన్‌.. ఆ తర్వాత క్రిష్, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలోని చిత్రాల్లో నటించాలని డిసైడ్‌ అయ్యారు. ఇప్పటికే వకీల్‌ సాబ్‌ తొలి షెడ్యూల్ పూర్తయింది. రెండవ షెడ్యూల్‌కి యూనిట్ సర్వం సిద్ధం చేస్తోంది.

5 రోజుల పాటు సినిమాలకు దూరం:
ప్రస్తుతం ఐదు రోజుల పాటు సినిమా షూటింగ్‌కు గ్యాప్‌ ఇచ్చి.. రాజకీయాలపై దృష్టి పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారని చెబుతున్నారు. రెండో షెడ్యూల్‌ గ్యాప్‌ లో క్రిష్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారట పవన్‌. షూటింగ్‌లకు ఐదు రోజుల విరామం ఇచ్చి రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారిస్తారట‌. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రాజకీయ భేటీలో భాగంగా కర్నూలు వెళ్తారట. రెండు రోజులపాటు స్థానిక నేతలతో సమావేశమై పార్టీ వ్యవహారాలపై చర్చిస్తారని అంటున్నారు. మొన్నటి వరకూ పూర్తిగా రాజకీయాలకే సమయాన్ని కేటాయిస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు ఆర్థిక అవసరాల కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెబుతున్నారు. అందుకే వరసగా సినిమాలను అంగీకరించారట. 

మరో మూడేళ్లు సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్‌?
కాసేపు రాజకీయాలు.. కాసేపు సినిమాలు ఇలానే పవన్‌ కల్యాణ్‌ తన ప్రస్థానాన్ని మరో మూడేళ్లు నడిపిస్తారని జనాలు అనుకుంటున్నారు. పూర్తిగా సినిమాల్లో పడి రాజకీయాలను పక్కన పెడితే ప్రజలతో పాటు అభిమానుల్లోనూ విశ్వాసం కోల్పోతామన్న ఉద్దేశంతోపాటు లేనిపోని అపప్రథను మూటగట్టుకోవలసి వస్తుందని భావిస్తున్నారట పవన్‌. అందుకే మధ్య మధ్యలో రాజకీయాల గురించి పట్టించుకోవాలని డిసైడ్‌ అయ్యారని అంటున్నారు. అందులో భాగంగానే గత కొంత కాలంగా రాజకీయాలకు దూరమైనందున షూటింగ్‌ గ్యాప్‌లో ఓసారి దాని సంగతి చూద్దామని పవన్‌ డిసైడ్‌ అయ్యారట. అందుకే ఐదు రోజుల పాటు తన ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. 

పవన్ కోసం ప్రత్యేక విమానం:
కర్నూలులో పార్టీ కార్యకర్తలతో చర్చలు అయ్యాక నేరుగా అమరావతికి చేరుకుంటారు పవన్‌. ఫిబ్రవరి 15న రాజధాని విషయంపై అక్కడి రైతులతో సమావేశం అవుతారని అంటున్నారు. ఆ సమావేశం అనంతరం నేరుగా హైదరాబాద్ చేరుకుని మళ్లీ షూటింగ్‌ లో జాయిన్ అవుతారట. ఈ ప్రయాణాలన్నింటికీ ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తారని టాక్‌. దానికి సంబంధించిన ఖర్చులు ఎవరు భరిస్తారు? అన్నది తెలియాల్సి ఉంది. అయితే షూటింగ్ ల నుంచి బయల్దేరితే మాత్రం మొత్తం ఖర్చుని నిర్మాత దిల్ రాజు భరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే ఇలా అటు ఇటూ షటిల్‌ సర్వీస్‌ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, వాటిని మేనేజ్‌ చేసుకొనే స్టామినా పవన్‌కు ఉందని చెబుతున్నారు. 

బీజేపీతో కలవడానికి కారణం అదేనా?
సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్సింగ్‌ చేసుకుంటూ పవన్‌ ముందుకెళ్లడంపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. రాజకీయాలను పవన్‌ పార్ట్‌ టైమ్‌గా భావిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాలను పార్ట్‌ టైమ్‌గా భావించాల్సిన సమయంలో వాటి పైనే పూర్తిగా దృష్టి పెడుతున్నారని పార్టీ కార్యకర్తలు, నేతలు గుసగుసలు ఆడుతున్నారు. కానీ, అభిమానులు మాత్రం సినిమాల్లో నటించడం ద్వారా తమను సంతృప్తి పరచబోతున్నారని అంటున్నారు. పవన్‌ ప్లాన్‌ వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయట. వరుసగా సినిమాల్లో నటించాలని ముందుగానే ఫిక్సవ్వడం వల్లే ఆయన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని చెబుతున్నారు. బీజేపీతో కలిసి వెళ్లడం ద్వారా క్యాడర్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు వీలవుతుందని లెక్కలేశాకే ఆ నిర్ణయం తీసుకున్నారని టాక్‌. మరి పవన్‌ ప్లాన్‌ ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుందో చూడాల్సిందే.