Commonwealth Games 2022: భారత్‌ ఖాతాలో 6వ స్వర్ణం.. హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన సుధీర్

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీ‌వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు.

Commonwealth Games 2022: భారత్‌ ఖాతాలో 6వ స్వర్ణం.. హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన సుధీర్

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ (Sudhir) స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఇప్పటికే ఈ గేమ్స్ లో భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలతో పాటు మొత్తం 20పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది.

Commonwealth Games: పాక్‌పై 8 వికెట్ల తేడాతో టీమిండియా అమ్మాయిల గెలుపు

ఇదిలాఉంటే 2018లో ఆసియా పారా గేమ్స్ కాంస్య పతక విజేత అయిన సుధీర్.. తాజా పోటీలో తన తొలి ప్రయత్నంలోనే 280 కిలోల బరువు ఎత్తి 212 కిలోలకు పెంచి రెండో ప్రయత్నంలో 134.5 పాయింట్లు సాధించి సరికొత్త రికార్డును బద్దలు కొట్టాడు.  హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు.

Commonwealth Games 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన 19ఏళ్ల జెరెమీ

సుధీర్ తన క్రీడా జీవితాన్ని 2013లో ప్రారంభించాడు. 2016 సంవత్సరంలో తన మొదటి జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించాడు. సుధీర్ 2018లో ఆసియా పారా గేమ్స్ 2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి కాంస్య పతకాన్ని సాధించాడు. 2018 సంవత్సరంలో 17వ సీనియర్, 12వ జూనియర్ నేషనల్ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లలో స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎంపికయ్యాడు.