Pakistan cricketer Naseem Shah: ఆ డబ్బులో సగం వారికే.. మంచి పనికోసం బ్యాట్‌ను వేలంకు పెట్టిన పాక్ యువ క్రికెటర్..

పాకిస్థాన్ యువ క్రికెటర్ నసీమ్‌ షా పాకిస్థాన్ వరద బాధితులకు తనవంతు సహాయం అందించేందుకు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో వరుసగా రెండు సిక్సులు కొట్టి పాక్ జట్టు ఆసియా కప్ టోర్నీలో ఫైనల్ కు చేరేలా చేసిన బ్యాట్‌ను వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు.

Pakistan cricketer Naseem Shah: ఆ డబ్బులో సగం వారికే.. మంచి పనికోసం బ్యాట్‌ను వేలంకు పెట్టిన పాక్ యువ క్రికెటర్..

Naseem Shah

Pakistan cricketer Naseem Shah: ఆసియా కప్ 2022 సూపర్-4లో అఫ్గానిస్తాన్‌పై పాకిస్థాన్ జట్టు విజయం సాధించిన విషయం విధితమే. అతి కష్టమీద విజయాన్ని పాక్ దక్కించుకుంది. అయితే ఈ విజయానికి ప్రధానకారకుడు 19ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా. చివరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి పాక్ జట్టును ఆసియాకప్ టోర్నమెంట్‌లో ఫైనల్ కు చేర్చాడు. ప్రస్తుతం నసీమ్‌షా పాకిస్థాన్ వరద బాధితులకు తనవంతు సహాయం అందించేందుకు అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో వరుసగా రెండు సిక్సులు కొట్టిన బ్యాట్‌ను వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు.

Asia Cup 2022 : భారత్ ఫైనల్ ఆశలు ఆవిరి.. అప్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ

అయితే 19ఏళ్ల పేసర్‌కు ఈ బ్యాట్‌ను సహచరుడు మహ్మద్ హుస్నైన్ అందించాడు. ప్రస్తుతం దానిని వేలం వేయడం ద్వారా వచ్చే సగం డబ్బును పాకిస్థాన్ వరద బాధితులకు అందించనున్నారు. అయితే వేలంలో పెడుతున్నట్లు ప్రకటించిన నసీమ్‌కు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అతికష్టంమీద విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ జట్టు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. ఫరీద్ అహమ్ద్ హీరిస్ రవూఫ్ అవుట్ కావటంతో నసీమ్ షా 18.2 ఓవర్ వద్ద బ్యాటింగ్ కు వచ్చాడు. ఆఖరి ఓవర్‌లో పాక్ జట్టు ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఒక వికెట్ పోయినా మ్యాచ్‌లో పాక్ ఓడిపోయినట్లే. ఆ పరిస్థితుల్లో చివరి ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో యువ పేసర్ నసీమ్ షా వరుసగా రెండు సిక్సులు కొట్టి పాకిస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దీంతో 19ఏళ్ల నసీమ్ రాత్రికి రాత్రే హీరో అయ్యాడు.