AB De Villiers: డివిలియర్స్ రిటర్న్స్.. క్లూ ఇచ్చిన కోహ్లీ

మిస్టర్‌ 360.. దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ మరోసారి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మళ్లీ కలవనున్నాడా.. డివిలియర్స్ ఆర్సీబీతో జతకట్టనున్నాడంటూ వస్తున్న ఊహాగానాలు బలపడేగా ఉంది విరాట్ కోహ్లీ ఇచ్చిన క్లూ.

AB De Villiers: డివిలియర్స్ రిటర్న్స్.. క్లూ ఇచ్చిన కోహ్లీ

Virat Kohli

 

 

AB De Villiers: మిస్టర్‌ 360.. దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ మరోసారి రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మళ్లీ కలవనున్నాడా.. డివిలియర్స్ ఆర్సీబీతో జతకట్టనున్నాడంటూ వస్తున్న ఊహాగానాలు బలపడేగా ఉంది విరాట్ కోహ్లీ ఇచ్చిన క్లూ. ఓ ఫన్నీ షోలో మాట్లాడిన కోహ్లీ.. ఏబీడీ రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలు అబద్ధం కాదని చెప్పాడు.

రాబోయే సీజన్‌లో ఏబీడీ రీఎంట్రీ ఇవ్వొచ్చనే కీలక కామెంట్లు చేశాడు. పర్సనల్‌గా ఏబీడీని చాలా మిస్‌ అవుతున్నానంటూ.. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుతుంటానని ఈ సందర్భంగా వెల్లడించాడు. డివిలియర్స్ ప్రస్తుతం అమెరికాలో గోల్ఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆర్సీబీ మ్యాచ్‌లను తప్పక ఫాలో అవుతానని అతనితో ఫోన్ లో చెప్పాడని వివరించాడు.

ఇటీవల గోల్డెన్ డక్ అవడంతో మొత్తం మూడు గోల్డెన్ డకౌట్ ల చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీని మీకు మూడు డక్స్‌ ఉన్నాయట కదా అంటూ పరోక్షంగా కౌంటర్ విసిరాడు. దీనిపై కోహ్లి స్పందిస్తూ.. జీవితంలో అన్నీ చూడాలి కదా అంటూ నవ్వుతూ సమాధానాన్ని తేల్చేశాడు.

Read Also: డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ

2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఏబీడీ.. గతేడాది ఐపీఎల్‌ నుంచి కూడా తప్పుకున్నాడు. అదే సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు విరాట్.

ఇదిలా ఉంటే, మే 13న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది ఆర్సీబీ. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరుకున్నట్లే.