Australia sexting scandal: షాకింగ్.. Tim Paine.. బావ Tubb కూడా అదే మహిళతో సెక్స్ చాటింగ్..!

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టును టిమ్ పైన్ సెక్స్ చాట్ వ్యవహారం కుదిపేస్తోంది. మహిళా సహోద్యోగితో టిమ్ పైన్ సెక్స్ చాటింగ్ బయటపడిన కొద్ది రోజులకే.. మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Australia sexting scandal: షాకింగ్.. Tim Paine.. బావ Tubb కూడా అదే మహిళతో సెక్స్ చాటింగ్..!

Tim Paine’s Brother In Law And Cricket Tasmania Colleague

Australia sexting scandal: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టును టిమ్ పైన్ (Tim Paine) సెక్స్ చాట్ (Sexting Scandal) వ్యవహారం కుదిపేస్తోంది. 2017లో క్రికెట్ టాస్మానియా (Cricket Tasmania) మహిళా సహోద్యోగితో టిమ్ పైన్ సెక్స్ చాటింగ్ వ్యవహారం బయటపడిన కొద్ది రోజులకే.. మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అతని బావ మాజీ టాస్మానియన్ షీల్డ్ క్రికెటర్ షానన్ టబ్ (Shannon Tubb) కూడా అదే మహిళతో సెక్స్ చాటింగ్ చేశాడట.

హెరాల్డ్ సన్‌ (Herald Sun)లోని నివేదికల ప్రకారం.. టిమ్ పైన్ సోదరిని వివాహం చేసుకున్న టబ్..  బామ్మర్ది టిమ్ చాటింగ్ చేసిన అదే మహిళతోనూ తాను అనుచితంగా ప్రవర్తించాడట.. 2018 విచారణ తర్వాత క్రికెట్ టాస్మానియాలో టబ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించారు. అప్పుడు టబ్ కూడా ఆ మహిళను చాలా నెలల పాటు లైంగికంగా వేధించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. టబ్ తనకు X-రేటెడ్ మెసేజ్ పంపాడని ఆమె పేర్కొంది. టబ్ కొన్ని అశ్లీల ఫొటోలను కూడా స్నాప్‌చాట్‌లో పంపినట్టు ఆమె ఆరోపించింది. 90లలో టాస్మానియాకు ప్రాతినిధ్యం వహించిన టబ్.. క్రికెట్ ఆస్ట్రేలియా XI (Cricket Australia XI)తోనే ఉన్నాడు. అయితే క్రికెట్ టాస్మానియాను విడిచిపెట్టిన తర్వాత ఎలైట్ అడిలైడ్ ప్రైవేట్ పాఠశాలలో కోచ్‌గా పనిచేశాడు.

అయితే.. పైన్, టబ్ బావా బామ్మర్ది ఇద్దరూ క్రికెట్ టాస్మానియాలో జూనియర్ సిబ్బంది అయిన ఒకే మహిళతో సెక్స్ చాటింగ్ చేసినట్టు తెలిసింది. 2018 మధ్యలో క్రికెట్ టాస్మానియా ద్వారా టబ్ విచారణ జరిగింది. సదరు మహిళతో టిమ్ అడిలైడ్ ప్రిన్ అల్ఫెరెడ్ కాలేజీలో క్రికెట్ కోచ్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమెతో అసభ్యకరంగా చాట్ చేశాడట.. అప్పుడే అతడు తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయినట్లు హెరాల్డ్ సన్ పత్రిక కథనం ప్రచురించింది. టబ్ క్రికెట్ టాస్మానియా నుంచి కూడా తప్పుకున్నాడట. టబ్‌పై వచ్చిన పలు ఆరోపణలపై విచారణ చేపట్టగా.. సదరు మహిళతో సెక్స్ చాటింగ్ చేసినట్లు వెల్లడైంది. టబ్ పై క్రికెట్ టాస్మానియా చర్యలు తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది.


మరోవైపు.. ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందే టిమ్ పైన్ (Tim Paine).. సెక్స్ చాట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పలు టెక్ట్స్ మెసేజెస్ పైన్, సదరు మహిళ మధ్య ఎక్స్‌ఛేంజ్ అయినట్లు తెలిసింది. పైన్.. ఆ మహిళకు అభ్యంతరకరమైన మెసేజెస్ పంపడమే కాకుండా తన నగ్న ఫొటోలను కూడా పంపినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) విచారించగా.. అందులో కూడా పైన్ చేసిన చాట్ నిజమేనని తేలింది. ఆసీస్ జట్టుకు కెప్టెన్ కాకముందే 2017లో ఈ వ్యవహారం జరిగింది. ఈ విషయం మరోసారి వెలుగులోకి రావడంతో టిమ్ పైన్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. యాషెస్ సిరీస్‌కు ముందు టిమ్ పైన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సెక్స్ చాటింగ్ వ్యవహారం ఏదో ఒక రోజు బయటకు వస్తుందని తాను ముందే ఊహించానని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు. ప్రతీ సిరీస్‌కు ముందు ఈ వ్యవహారం బయటకు వస్తోందని పైన్ తెలిపాడు.

Read Also : Virat Kohli : ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’.. కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పశ్చాత్తాపం