ఆసీస్‌ను కంగారెత్తిస్తోన్న భారత బౌలర్లు

నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్‌గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్‌ను పడగొట్టాడు.

నిర్ణయాత్మక వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. తొలి మూడు ఓవర్లలోనే మొదటి వికెట్‌గా క్యారీ(5)ను పడగొట్టిన భువనేశ్వర్ భారత వికెట్ల ఖాతాలో బోణీ కొట్టి ఆ తర్వాత ఫించ్(14) వికెట్‌ను పడగొట్టాడు. షాన్ మార్ష్‌(39)ను 100-3పరుగుల వద్ద పడగొట్టిన చాహల్ కేవలం మూడు బంతుల వ్యవధిలోనే తానే క్యాచ్ పట్టి ఉస్మాన్ ఖవాజాను నాలుగో వికెట్‌గా 34 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మార్కస్ స్టోనిస్‌ వికెట్‌ను కూడా పడగొట్టి తుది జట్టు ఎంపికలో కోహ్లీ తీసుకున్న నిర్ణయానికి తగ్గ న్యాయం చేశాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 124/5 స్కోరు చేయగలిగింది. 

వికెట్లు పడిన సమయం:
అలెక్స్ క్యారీ 2.5 ఓవర్లకు 8-1పరుగుల వద్ద
ఆరోన్ ఫించ్ 8.6 ఓవర్లకు 27-2 పరుగుల వద్ద
షాన్ మార్ష్ 23.1 ఓవర్లకు 100-3 పరుగుల వద్ద
ఉస్మాన్ ఖవాజా 23.4 ఓవర్లకు 101-4 పరుగుల వద్ద
మార్కస్ స్టోనిస్ 29.3 ఓవర్లకు 123-5 పరుగుల వద్ద