Live: IPL2020, RCB VS MI: మరో మ్యాచ్ ‘సూపర్’.. ముంబైపై బెంగుళూరు విజయం

  • Published By: vamsi ,Published On : September 28, 2020 / 05:20 PM IST
Live: IPL2020, RCB VS MI: మరో మ్యాచ్ ‘సూపర్’.. ముంబైపై బెంగుళూరు విజయం

[svt-event title=”ముంబై‌పై సూపర్ ఓవర్‌లో రాయల్ ఛాలెంజర్స్ విజయం” date=”28/09/2020,11:49PM” class=”svt-cd-green” ] IPL 2020: 13వ సీజన్‌లో 10వ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌ చివరకు సూపర్ ఓవర్‌కి వెళ్లింది. ఆఖరి ఓవర్‌లో 19పరుగులు చెయ్యాల్సిన సమయంలో 18పరుగులు చేసింది ముంబై. ఈ క్రమంలోనే సూపర్‌ ఓవర్‌లో ఇరు జట్లు తేల్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ 11పరుగులు చెయ్యడంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్. [/svt-event]

[svt-event title=”విన్నర్ ఎవరో తేల్చేసేందుకు సూపర్ ఓవర్!” date=”28/09/2020,11:26PM” class=”svt-cd-green” ] 202 టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ సరిగ్గా 201పరుగులు తీయడంతో మ్యాచ్ టై గా ముగిసింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్‌ను డిసైట్ చెయ్యబోతున్నారు. [/svt-event]

[svt-event title=”లాస్ట్ ఓవర్.. 19పరుగులు.. టెన్షన్.. టెన్షన్” date=”28/09/2020,11:15PM” class=”svt-cd-green” ] [/svt-event]

[svt-event title=”ముంబై టార్గెట్ 202″ date=”28/09/2020,9:14PM” class=”svt-cd-green” ] ఐపీఎల్‌-13లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ముంబైకి 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. [/svt-event]

[svt-event title=”పాడిక్కల్ పోరాటం.. ” date=”28/09/2020,8:44PM” class=”svt-cd-green” ] రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ తరఫున పాడిక్కల్ పోరాటం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో తన రెండవ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు పాడిక్కల్ ప్రస్తుతం 38బంతుల్లో 54పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. [/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. కోహ్లీ అవుట్..” date=”28/09/2020,8:30PM” class=”svt-cd-green” ] దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఫించ్ వికెట్ కోల్పోయిన బెంగళూరు.. రెండవ వికెట్‌గా కోహ్లీ అవుట్ అయ్యాడు. 11బంతుల్లో 3పరుగులకే కోహ్లీ పెవిలియన్ చేరుకున్నాడు. [/svt-event]

Boult gets the much needed breakthrough.

Finch departs after scoring 52 runs.

Live – https://t.co/ubNrhzZQsp #Dream11IPL #RCBvMI pic.twitter.com/12ZhlzWjpD

— IndianPremierLeague (@IPL) September 28, 2020

[svt-event title=”ఆరోన్ ఫించ్.. ఉతికి ఆరేశాడు.. 32బంతుల్లో హాఫ్ సెంచరీ” date=”28/09/2020,8:09PM” class=”svt-cd-green” ] ఐపిఎల్ 2020 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు దిశగా ముందుకు సాగుతుంది. కేవలం 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 81పరుగులు చేసింది. పాడికల్ 19 బంతుల్లో 23 పరుగులు చేయగా, ఫించ్ 35 బంతుల్లో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇద్దరు బ్యాట్స్ మెన్ వారి స్టైల్లో బ్యాటింగ్ చేయగా.. స్కోరు బోర్టు పరుగులు పెట్టింది. ఫించ్ అవుట్ అయిన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. [/svt-event]

[svt-event title=”ఆరంభం అదిరింది: 5ఓవర్లలో 49పరుగులు” date=”28/09/2020,7:39PM” class=”svt-cd-green” ] IPL 2020, RCB vs MI Live స్కోరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) – దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్ 5 ఓవర్ల తర్వాత 49/0 పరుగులతో బెంగళూరుకు శుభారంభ ఇన్నింగ్స్ ఇచ్చారు. పాడిక్కల్ 07 బంతుల్లో 09 పరుగులు, ఫించ్ 23 బంతుల్లో 40 పరుగులు చేశారు. [/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. బెంగళూరు బ్యాటింగ్:” date=”28/09/2020,7:08PM” class=”svt-cd-green” ] ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ మెుదలైంది. రెండు జట్లూ బలమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ ఉండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

బెంగళూరు తుది జట్టు: దేవదత్ పాడికల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), ఎబి డివిలియర్స్, ఇసురు ఉడానా (వికెట్‌ కీపర్‌, గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జాంపా


ముంబై తుది జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్ కిషన్, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా [/svt-event]


[svt-event title=”RCB vs MI:” date=”28/09/2020,6:31PM” class=”svt-cd-green”] హెడ్ ​​టు హెడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మొత్తం 27మ్యాచ్‌లు జరిగాయి. అందులో MI 18మ్యాచ్‌లు గెలిచింది. RCB 9మ్యాచ్‌లు గెలిచింది.

[/svt-event]

[svt-event title=”ముంబై ఇండియన్స్:” date=”28/09/2020,6:19PM” class=”svt-cd-green” ]  Probable XI: Rohit Sharma (c), Quinton de Kock (wk), Suryakumar Yadav, Saurabh Tiwary, Hardik Pandya, Kieron Pollard, Krunal Pandya, Trent Boult, James Pattinson, Rahul Chahar, Jasprit Bumrah [/svt-event]

[svt-event title=”రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:” date=”28/09/2020,6:16PM” class=”svt-cd-green” ]  Probable XI: Devdutt Padikkal, Aaron Finch, Virat Kohli (c), AB de Villiers, Shivam Dube, Joshua Philippe/Moeen Ali, Isuru Udana/Dale Steyn, Washington Sundar, Navdeep Saini, Umesh Yadav/Mohammed Siraj, Yuzvendra Chahal [/svt-event]

[svt-event title=”పిచ్ రిపోర్ట్:” date=”28/09/2020,5:36PM” class=”svt-cd-green” ] షార్జన్ క్రికెట్ స్టేడియంతో పోలిస్తే దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

పరిమాణం ప్రకారం, ఇది చాలా పెద్దది. షార్జా క్రికెట్ స్టేడియంలో పారినట్లుగా ఇక్కడ పరుగుల వరదకు అవకాశం లేదు. ఇక్కడ పిచ్‌లో గడ్డి ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో ఇరు జట్లు మ్యాచ్ ఆడవచ్చు. [/svt-event]

[svt-event title=”వాతావరణం:” date=”28/09/2020,5:31PM” class=”svt-cd-green” ] దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఆటగాళ్ళు మాత్రం ఇక్కడ తీవ్రమైన వేడిని ఎదుర్కోవలసి వస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు. [/svt-event]

[svt-event title=”IPL 2020, RCB vs MI Live Streaming: ” date=”28/09/2020,5:13PM” class=”svt-cd-green” ] ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) 13వ సీజన్ 10వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మరియు ముంబై ఇండియన్స్(MI) మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ Dubai International Cricket Stadiumలో జరగబోతుంది.


టోర్నమెంట్‌లో ఇరు జట్లకు మూడో మ్యాచ్ ఇది. ఇద్దరూ ఒకదానిలో ఓడిపోయి, ఒకదానిలో గెలిచారు. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఓటమిని ఎదుర్కోవలసి రాగా.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబై ఇండియన్స్ ఓడించింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను ఓడించగా.. రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో ఓడిపోయింది. [/svt-event]

[svt-event date=”28/09/2020,5:26PM” class=”svt-cd-green” ] కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో బెంగళూరు 97 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో, RCB తమ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)ను ఓడించింది. మరోవైపు, ఐపిఎల్ 2020లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్(MI) కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన చివరి మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, ముంబయ్ తమ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. [/svt-event]

[svt-event title=”బ్యాటింగే బలంగా:” date=”28/09/2020,5:27PM” class=”svt-cd-green” ] ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. భారత జట్టు ఇద్దరు కీలకమైన కెప్టెన్‌ల మధ్య ఈ మ్యాచ్ జరగనుండగా మ్యాచ్‌పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. RCB మరియు MI జట్ల బలం శక్తివంతమైన బ్యాటింగ్. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్, దేవదత్ పడికల్, జోష్ ఫిలిప్ మరియు ఎబి డివిలియర్స్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. ముంబైలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, సౌరభ్ తివారీ వంటి ఆటగాళ్ళు ఉన్నారు.

[/svt-event]

[svt-event title=”వాతావరణం:” date=”28/09/2020,5:30PM” class=”svt-cd-green” ] దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఆటగాళ్ళు మాత్రం ఇక్కడ తీవ్రమైన వేడిని ఎదుర్కోవలసి వస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు. [/svt-event]