BCCI: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. ఏడేళ్ల త‌రువాత వారికి రోజువారీ భ‌త్యం పెంపు

దాదాపు ఏడు సంవ‌త్స‌రాల త‌రువాత రోజువారీ భత్యంలో మార్పులు చేశారు. ఇంత‌క ముందు వ‌ర‌కు ఆఫీస‌ర్ బేర‌ర్లు విదేశీప‌ర్య‌ట‌న స‌మ‌యంలో రోజువారి భ‌త్యం కింద 750 డాల‌ర్లు పొందగా ఇప్పుడు దాన్ని 1000 డాల‌ర్ల‌కు పెరిగింది.

BCCI: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. ఏడేళ్ల త‌రువాత వారికి రోజువారీ భ‌త్యం పెంపు

BCCI

BCCI: భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) కీలక నిర్ణ‌యం తీసుకుంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో ఆఫీస్‌ బేర‌ర్లకు చెల్లించే రోజువారీ భ‌త్యాన్ని పెంచింది. అంతేకాదు వీరు ఫ‌స్ట్‌క్లాస్‌లో ప్ర‌యాణించేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఆదివారం జ‌రిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ గ‌త అక్టోబ‌ర్ నుంచే ఈ అల‌వెన్సులు అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు తెలిపింది.

దాదాపు ఏడు సంవ‌త్స‌రాల త‌రువాత రోజువారీ భత్యంలో మార్పులు చేశారు. ఇంత‌క ముందు వ‌ర‌కు ఆఫీస‌ర్ బేర‌ర్లు విదేశీప‌ర్య‌ట‌న స‌మ‌యంలో రోజువారి భ‌త్యం కింద 750 డాల‌ర్లు పొందగా ఇప్పుడు దాన్ని 1000 డాల‌ర్ల‌కు పెరిగింది. దేశంలో జ‌రిగే స‌మావేశాల‌కు, బిజినెస్ క్లాస్ ప్రయాణానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీతో సహా ఆఫీస్ బేరర్‌ల‌కు రోజుకు రూ.40వేల వ‌ర‌కు అర్హులు.

వ‌ర్క్ ట్రావెల్ కోసం రోజుకు రూ.30వేలు చెల్లిస్తారు. వీరు దేశీయ, విదేశీ పర్యటనలలో సూట్ రూమ్ బుక్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) చైర్మన్‌కు కూడా ఆఫీస్ బేరర్స్ అల‌వెన్సులే వ‌ర్తించ‌నున్నాయి.

పురుషులు, మహిళలు రెండు జాతీయ జట్లకు ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసే క్రికెట్ సలహా కమిటీలోని ముగ్గురు సభ్యులకు సమావేశాల కోసం ఒక్కొక్కరికి రూ. 3.5 లక్షలు చెల్లిస్తారు. వీరు విదేశీ ప్ర‌యాణాలు చేయాల్సిన అవ‌స‌రం లేన‌ప్ప‌టికీ.. ఒక‌వేళ వెళితే మాత్రం రోజుకు 400 డాల‌ర్లు చెల్లించ‌నున్నారు. బీసీసీఐ సీఈఓ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళితే రోజుకు 650 డాల‌ర్లు, స్వ‌దేశంలో అయితే రోజుకు రూ.15వేలు భ‌త్యంగా పొంద‌నున్నారు.

IPL 2023 : హమ్మయ్య.. హైదరాబాద్ గెలిచింది, రెండు ఓటముల తర్వాత విజయం