Steve Smith: ఇలాకూడా కొట్టొచ్చా..! క్రీజ్‌లో స్టీవ్ స్మిత్.. ఒక్క బాల్‌కు 16 పరుగులిచ్చిన బౌలర్.. వీడియో వైరల్

బిగ్‌బాష్ లీగ్ 2022 - 23 సీజన్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్, హోబర్డ్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 180 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 33 బంతుల్లో 66 పరుగులు చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హరికేన్స్ బౌలర్ జోయల్ పారిస్ తన బౌలింగ్ ఒక్క బాల్‌కు 16 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Steve Smith: ఇలాకూడా కొట్టొచ్చా..! క్రీజ్‌లో స్టీవ్ స్మిత్.. ఒక్క బాల్‌కు 16 పరుగులిచ్చిన బౌలర్.. వీడియో వైరల్

Steve Smith

Steve Smith: క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా ఒక్క బాల్‌కు అత్యధికంగా ఎన్ని పరుగులు వస్తాయంటే క్రికెట్ పై అవగాహన ఉన్నవారు ఎవరైన టక్కున సిక్స్ అంటారు. ఒకవేళ బౌలర్ నోబ్ బాల్ వేసినా, వెంటనే మరోబాల్‌కు సిక్స్ కొట్టినా పది పరుగుల స్కోర్ దాటుతుంది. కానీ ఏకంగా ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో ఒక్క బాల్‌కు బౌలర్ 16 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

India vs New zealand ODI Series: ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ రెండో వ‌న్డే.. ఫొటో గ్యాల‌రీ

బిగ్‌బాష్ లీగ్ 2022 – 23 సీజన్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్, హోబర్డ్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 180 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 33 బంతుల్లో 66 పరుగులు చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హరికేన్స్ బౌలర్ జోయల్ పారిస్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ వేశాడు. తొలి రెండు బాల్స్ పరుగులేమీ కొట్టలేకపోయిన స్మిత్ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు. అయితే ఆ బాల్‌ను అంపైర్ నోబ్ బాల్‌గా ప్రకటించాడు. జోయల్ పారిస్ మరోబాల్‌ను వైడ్ వేశాడు. కీపర్ అందుకోలేక పోవటంతో అది ఫోర్ పోయింది. దీంతో ఒకే బాల్‌కు 12 పరుగులు వచ్చాయి.

 

మూడోసారి వేసిన బాల్‌ను స్మిత్ ఫోర్ కొట్టడంతో ఒక్క బాల్‌కే 16 పరుగులు వచ్చాయి. సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు హరికేన్స్ జట్టు బ్యాటర్లు బరిలోకి దిగారు. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి హరికేన్స్ జట్టు 156 పరుగులు మాత్రమే చేయడంతో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఒకేబాల్ కు 16 పరుగులు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు స్మిత్ ఇలా కూడా కొట్టొచ్చా అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.