ఐపీఎల్‌లో ఈ రికార్డు అజరామరం.. ఎప్పటికీ అంతం కాకపోవచ్చు!

  • Published By: vamsi ,Published On : September 18, 2020 / 10:15 AM IST
ఐపీఎల్‌లో ఈ రికార్డు అజరామరం.. ఎప్పటికీ అంతం కాకపోవచ్చు!

ఒక బౌలర్ ఒక ఓవర్లో 37 పరుగులు ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం కానీ.. ఐపిఎల్‌లో ఇది సాధ్యం అయ్యింది. ఈ రికార్డు ఎప్పటికీ అంతం కానిది కావచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం.




ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో ఒక జట్టు అత్యధిక పరుగులు చేసిన రికార్డును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కలిగి ఉంది. 2013లో 263/5 పరుగులు చేసిన ఆర్‌సిబి ఈ రికార్డు సృష్టించింది.

ఇదిలా ఉంటే ఒకే ఓవర్‌లో 37 పరుగులు అంటే దాదాపు అసాధ్యమే.. ఎందుకంటే ఓవర్‌కు 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టినా 36 పరుగులే వస్తాయి. కానీ ఆ బౌలర్ వేసిన నోబాల్‌ను భారీ షాట్ ఆడడంతో ఈ వరల్డ్ రికార్డు నమోదైంది.

ఈ యూనిక్ రికార్డును నమోదు చేసింది యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్. ఆర్‌సీబీ తరుపున ఆడుతున్నప్పుడే గేల్ ఈ రికార్డ్ క్రయేట్ చేశాడు. అన్ని పరుగులు సమర్పించుకుందది కేరళ క్రికెటర్ ప్రశాంత్ పరమేశ్వరణ్.



ఐపీఎల్ 2011వ సీజన్‌లో భాగంగా కొచ్చి టస్కర్స్ కేరళ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వరెస్ట్ రికార్డు నమోదైంది. ప్రశాంత్ పరమేశ్వరణ్ వేసిన మూడో ఓవర్‌లో గేల్ బంతుల్ని స్టేడియం దాటించాడు. 6, 6+నోబాల్, 4, 4, 6, 6, 4తో మొత్తం 37 పరుగులు రాబట్టాడు గేల్. పరమేశ్వరణ్ వేసిన నోబాల్‌‌తో కలిసి మొత్తం 7 బంతులు ఆడిన గేల్.. ఏడింటిని బౌండరీకి తరలించాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఇది చెరిగిపోని రికార్డుగా మిగిలిపోవచ్చు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కొచ్చి టస్కర్స్ కేరళ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా(23), మెకల్లమ్ (22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.




అనంతరం చేజింగ్‌కు దిగిన ఆర్‌సీబీ గేల్ సునామీ ఇన్నింగ్స్‌కు తోడు దిల్షాన్(52 నాటౌట్), విరాట్ కోహ్లీ(27 నాటౌట్) రాణించడంతో 13.1 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 128 పరుగులు చేసి 9 వికెట్ల ఘన విజయం అందుకుంది.