Chris Greaves : అమెజాన్ డెలివరీ బాయ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా

అమెజాన్ డెలివరీ బాయ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు క్రిస్ గ్రేవ్స్.. ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో స్కాట్లాండ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

Chris Greaves : అమెజాన్ డెలివరీ బాయ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా

Chris Greaves

Chris Greaves : చాలామంది తమ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి పైకొస్తారు. ఆలా కష్టపడి వచ్చిన వారు ఏ రంగంలో అయినా నిలదొక్కుగలుగుతారు. ప్రస్తుతం ఉన్న వ్యాపారవేత్తల్లో ఎంతోమంది చిన్నపాటి వ్యాపారంతో ప్రారంభించి .. అంచలంచలుగా ఎదుగుతూ గొప్ప వ్యాపాతరవేత్తలయ్యారు. ఎందరో క్రీడాకారులు వెలుగులోకి రాకముందు అనేక కష్టాలు పడ్డారు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ తమ లక్ష్యాన్ని మరువకుండా ప్రయత్నిస్తూ ఓ స్థాయికి చేరుకున్నారు. ఆలా కష్టపడి ఇప్పుడు ఒకస్థాయికి చేరిన క్రీడాకారులు కోకొల్లలు.

చదవండి : ICC T20 World Cup 2021: భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎవరెవరికి ఎంతంటే?

ఇక తాజాగా ఐసీసీ 2020లో ఆడుతున్న స్కాట్లాండ్ క్రికెటర్ క్రిస్ గ్రేవ్స్ కూడా ఈ కోవకు చెందిన వాడే.. అతడు స్కాట్లాండ్ జట్టులోకి రాకముందు.. అమెజాన్‌లో పార్సెల్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. దక్షిణాఫ్రికాలో జన్మించిన క్రిస్ గ్రేవ్స్ అక్కడే క్రికెట్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతడు స్కాట్లాండ్ వచ్చాడు. ఇక్కడ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. అదృష్టం కలిసిరావడంతో స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు.

ఇక ఆదివారం బాంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి స్కాట్లాండ్ జట్టుకు విజయం అందించారు. 53 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన క్రిస్ గ్రేవ్స్ తన అద్భుతమైన ఆటతీరుతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చిన్న జట్టు అనే అంచనాతో వచ్చిన బంగ్లాదేశ్‌కు క్రిస్ గ్రేవ్స్ చెమటలు పెట్టించాడు. 28 బంతుల్లో 45 పరుగులతో జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.

చదవండి : ICC T20 : భారత్ – పాక్ మ్యాచ్.. టపాసులు పట్టుకొని దుబాయ్ వెళ్లిన పాక్ అభిమాని

ఇక ఒకింత స్వల్ప లక్ష్యంగానే భావించి బరిలోకి దిగిన బంగ్లాకు ఓటమి రుచి చూపించారు. అద్భుతమైన బౌలింగ్‌తో 134 పరుగులకే బంగ్లాను కట్టడి చేశారు. క్రిస్ గ్రేవ్స్ బంగ్లా జట్టులో కీలక ఆటగాళ్ళైన షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్‌ను పెవిలియన్‌కి పంపాడు. జట్టు విజయంలో నాటి అమెజాన్ డెలివరీ బాయ్, నేటి స్కాట్లాండ్ ఆటగాడు క్రిస్ గ్రేవ్స్ కీలక పాత్ర పోషించాడు.