Deepak Hooda : అతడు ఆడిన 16 మ్యాచుల్లోనూ భారత్‌ విజయం.. టీమిండియాకు లక్కీగా మారిన ఆల్‌రౌండర్

భారత జట్టు ఆల్ రౌండర్ దీపక్ హుడా.. టీమిండియాకు లక్కీగా మారాడు. హుడా అరుదైన వరల్డ్ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన తర్వాత ఎక్కువ విజయాలు సాధించిన క్రికెటర్ గా హుడా రికార్డ్ నెలకొల్పాడు.

Deepak Hooda : అతడు ఆడిన 16 మ్యాచుల్లోనూ భారత్‌ విజయం.. టీమిండియాకు లక్కీగా మారిన ఆల్‌రౌండర్

Deepak Hooda : భారత జట్టు ఆల్ రౌండర్ దీపక్ హుడా.. టీమిండియాకు లక్కీగా మారాడు. హుడా అరుదైన వరల్డ్ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన తర్వాత ఎక్కువ విజయాలు సాధించిన క్రికెటర్ గా హుడా రికార్డ్ నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డ్ రొమానియా ప్లేయర్ నడిగోటియా(15) పేరిట ఉండేది. హుడా ఆడిన 16 మ్యాచుల్లోనూ భారత్ గెలుపొందింది. ఒక్క దాంట్లోనూ ఓడిపోలేదు. హుడా ఇప్పటివరకు 9 టీ20లు, 7 వన్డేలు ఆడాడు. ఆగస్ట్‌ 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌ టీమ్‌లోనూ చోటు సంపాదించాడు హుడా.

దీపక్ హుడా ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో సత్తాచాటి జట్టులో స్థానాన్ని సుస్ధిరం చేసుకున్న హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా జింబాబ్వేతో రెండో వన్డేలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో హుడా 25 పరుగులతో పాటు ఒక వికెట్‌ పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌తో దీపక్ హుడా ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన తర్వాత హుడా ఆడిన 16 మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. తద్వారా అం‍తర్జాతీయ క్రికెట్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హుడా నిలిచాడు.

గతంలో ఈ రికార్డు రొమేనియా ఆటగాడు నడిగోటియా పేరిట ఉండేది. నడిగోటియా అరంగేట్రం చేసిన అనంతరం రొమేనియా 15 మ్యాచ్‌ల్లో విజయం నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో నడిగోటియా ప్రపంచ రికార్డును హుడా బద్దలు కొట్టాడు. ఇక సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ (13), రొమానియా క్రికెటర్ శంతను వశిష్ఠ్‌ (13) కూడా ఈ జాబితాలో ఉన్నారు.