Virat Kohli : విరాట్ కోహ్లీలో వరుణ్ తేజ్‌కు నచ్చే అంశం ఏమిటో తెలుసా..?
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Virat Kohli- Varun Tej
Virat Kohli- Varun Tej : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోనూ తనదైన శైలిలో పరుగుల వరద పారిస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కాగా.. కింగ్ కోహ్లీ పుట్టిన రోజు దగ్గరకు వస్తోంది. నవంబర్ 5న 35వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. అయితే.. ఆ రోజే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
దీంతో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. తద్వారా తన పుట్టిన రోజును మరింత మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని భావిస్తున్నారు. అందుకు ఓ కారణం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు వన్డేల్లో 48 శతకాలు చేశాడు. అంతర్జాతీయంగా వన్డే క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఆయన వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు.
పుట్టిన రోజున కోహ్లీ సెంచరీ చేస్తే సచిన్ రికార్డు సమం అవుతుంది. లేదంటే అంతకముందు టీమ్ఇండియా శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లోనూ కోహ్లీ శతకం చేసి, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ సెంచరీ చేస్తే అప్పుడు సచిన్ రికార్డు బద్దలు అవుతుంది. ఏదీ ఏమైనప్పటికీ పుట్టిన రోజు విరాట్ సెంచరీ చేస్తే అది ఓ రికార్డుగా మిగిలిపోనుంది.
వరుణ్ తేజ్‌కు విరాట్‌లో ఏ విషయం నచ్చుతుందంటే..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు క్రికెట్ అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే. కాగా.. వరుణ్ తేజ్‌కు విరాట్ కోహ్లీలో అగ్రెషన్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ చెప్పాడు. అక్టోబర్ 22న ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌కు తెలుగు కామెంట్రీలో వరుణ్ తేజ్ పాల్గొన్నాడు. మిగతా కామెంటేటర్లతో కలిసి అలరించాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీలో ఏం నచ్చుతుందని అడుగగా వరుణ్ పై విధంగా స్పందించాడు. విరాట్ కోహ్లీ పుట్టిన రోజుకు సమయం దగ్గర పడడంతో వరుణ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి వివాహా వేడుకలు మొదలు అయ్యాయి. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో జరగనుంది.
? @imVkohli – పేరు వినబడితే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయ్ ?
మరి #KingKohli లో ? @IAmVarunTej కి నచ్చిన అంశం ఏంటో చూసేయండి ?
చూడండి | ICC Men’s Cricket World Cup #INDvENG | Oct 29 | 12:30 PM నుండి
మీ #StarSportsTelugu & Disney + Hotstar లో#ViratKohli pic.twitter.com/ce1ABrFNEn— StarSportsTelugu (@StarSportsTel) October 25, 2023