Ben Stokes Bag Stole : కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో తన బ్యాగ్ దొంగిలించడంపై బెన్ స్టోక్స్ ఆగ్రహం

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాగ్ ను చోరీ చేశారు. లండన్‌లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో తన దుస్తులతో కూడిన బ్యాగ్ ను దొంగిలించారు. ఈ ఘటనపై బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Ben Stokes Bag Stole : కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో తన బ్యాగ్ దొంగిలించడంపై బెన్ స్టోక్స్ ఆగ్రహం

Ben Stokes Bag Stole : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాగ్ ను చోరీ చేశారు. లండన్‌లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో తన దుస్తులతో కూడిన బ్యాగ్ ను దొంగిలించారు. ఈ ఘటనపై బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బ్యాగ్ ను దొంగిలించడం పట్ల స్టోక్స్ మండిపడ్డారు. కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్‌లో బ్యాగ్ దొంగిలించిన వారికి అందులోని తన బట్టలు చాలా పెద్దగా అవుతాయని ట్విట్టర్ లో స్టోక్స్ పేర్కొన్నాడు.

రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున స్టోక్స్ ఆడనున్నారు. టోర్నీ కోసం ఆయన భారత్‌కు వెళ్లాల్సి ఉంది. “బాజ్‌బాల్” క్రికెట్ లో ప్రసిద్ధి చెందిన బ్రెండన్ మెకల్లమ్ కోచింగ్‌లో స్టోక్స్ ఇంగ్లాండ్ కెప్టెన్‌గా సంపూర్ణ శిక్షణ పొందాడు. ఆల్ రౌండర్ అయిన స్టోక్స్, బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శనలతో టెస్ట్ క్రికెట్‌లో జట్టును ఆదర్శంగా నడిపించాడు.

Ben Stokes Test Sixes: బెన్ స్టోక్స్ కొత్త చరిత్ర.. మెక్ కల్లమ్ రికార్డును చెరిపేశాడు..

T20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ పర్యటనలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. ODI రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుని 2023లో ODI ప్రపంచ కప్ లో ఆడాలని అభిమానులు అతనిని కోరుతున్నారు. దీనిపై స్టోక్స్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్ అతనితో చర్చలు జరిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తాను ఉద్దేశపూర్వకంగానే బెన్‌ను ఒంటరిగా వదిలేయడానికి ప్రయత్నించానని ఇంగ్లండ్ వన్డే కోచ్ మాథ్యూ మోట్ చెప్పాడు. అతను ఆడాలనుకుంటున్నాడా లేదా అనేది సమస్య అన్నారు. అతను ఆడుతాడా లేదా అనేది స్టోక్స్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.