FIFA World Cup 2022: అర్జెంటీనాలో అంబరాన్ని తాకిన ఫ్యాన్స్ సంబురాలు.. రోడ్లపైకొచ్చి గంతులేశారు.. వీడియోలు వైరల్
ఫిఫా వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆర్జెటీనా జట్టు ఫైనల్ కు చేరుకుంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో జట్టు అద్భుత ఆటతీరును కనబర్చి తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో పత్యర్థి జట్టు క్రొయేషియాను 3-0తో ఓడించారు.

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆర్జెటీనా జట్టు ఫైనల్ కు చేరుకుంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో జట్టు అద్భుత ఆటతీరును కనబర్చి తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో పత్యర్థి జట్టు క్రొయేషియాను 3-0తో ఓడించారు. అర్జెటీనా ఫైనల్ కు చేరడంతో ఆ దేశంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజధాని నగరంలోని వీధుల్లోకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు ఆనందంతో గెంతుతూ సందడి చేశారు. మెస్సీ పేరు జపిస్తూ సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
What a love for one man MESSI pic.twitter.com/4excCL5V9H
— Doocity (@Doocity1) December 13, 2022
ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఐదో గోల్స్ చేసిన మెస్సీ, ప్రపంచకప్‌లలో దేశం తరఫున ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌గా గాబ్రియెల్ బాటిస్టుటా (10)ను అధిగమించాడు. అతని పేరిట 11 ప్రపంచకప్ గోల్స్ ఉన్నాయి. 35ఏళ్ల మెస్సీ జర్మనీ మాజీ ఆటగాడు లోథర్ మాథ్యూస్ 25 ప్రపంచ కప్ మ్యాచ్‌ల రికార్డును కూడా సమం చేశాడు.
Arjantinliler, Buenos Aires'de final kutlamasını Messi şarkılarıyla yapıyor pic.twitter.com/2haXbC5Syo
— Goligspor haber (@goligspor) December 13, 2022